రహస్యంగా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్న TikTok, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న Apple

రహస్యంగా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్న TikTok, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న Apple

పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టిక్(tiktok) ఒకటి. భారత ప్రభుత్వం అనుమానమే నిజమైంది. టిక్ టాక్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టిక్ టాక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సీక్రెట్ గా యాక్సెస్ చేస్తోంది. డేటాను రీడ్ చేయడం, దొంగిలించడం, చైనా సర్వర్లకు పంపడం వంటివి చేస్తోంది. ఆపిల్(Apple) సంస్థ రెడ్ హ్యాండెడ్ గా టిక్ టాక్ ని పట్టుకుంది.

టిక్ టాక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆపిల్:
టిక్ టాక్ పై అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. టిక్ టాక్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చైనా సర్వర్లకు వెళ్తోందనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం నిరూపితమైంది. ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఐఫోన్ వాడుతున్న వాళ్లకు ఈ ప్రమాదం మరింత పొంచి ఉన్నట్లు వెల్లడైంది. ఒక వినియోగదారుడు ఆపిల్ ఐఓఎస్ 14 ప్రివ్యూని ఇన్ స్టాల్ చేసిన వెంటనే ఈ విషయం బయటపడింది. సదరు వినియోగదారుడు తన ఫోన్ లో క్లిప్ బోర్డ్ లోకి కాపీ చేసే సమాచారాన్ని అతనికి ఏ మాత్రం తెలియకుండా టిక్ టాక్ దొంగిలిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ వినియోగదారుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో వెంటనే తన ఫోన్ నుంచి టిక్ టాక్ డిలీట్ చేశాడు.

క్లిప్ బోర్డులోని యూజర్ డేటా చోరీ:
క్లిప్ బోర్డులో ఉండే సమాచారాన్ని రీడ్ చెయ్యడం ఆపేస్తామని టిక్ టాక్ యాజమాన్యం గతంలో చెప్పింది. కానీ వాస్తవంగా ఆ పని చెయ్యడం లేదు. ఇప్పటికీ వినియోగదారుల సమాచారాన్ని రీడ్ చేస్తూనే ఉంది. Apple iOS 14’s beta version లో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. ఏదైనా యాప్ కనుక యూజర్ల సమచారాన్ని యాక్సెస్ చేసినట్లు అయితే వెంటనే సదురు యూజర్ కి నోటిఫికేషన్ వెళ్లిపోతుంది. ఆ విధంగా టిక్ టాక్ బండారం బట్టబయలైంది.

టిక్ టాకే కాదు ఈ మూడు యాప్స్ కూడా డేంజరే:
ఐఓస్ క్లిప్ బోర్డులోని సమాచారాన్ని ఒక్క టిక్ టాకే కాదు మరికొన్ని యాప్స్ కూడా రీడ్ చేయగలవు. Accu Weather, Call Of Duty Mobile, Google News సైతం వినియోగదారుల డేటాను రీడ్ చేస్తున్నాయని తేలింది. టిక్ టాక్ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో యాజమాన్యం స్పందించింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇకపై రీడ్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ చెయ్యము. యూజర్ల డేటాకు పూర్తి భద్రత కల్పిస్తామని స్టేట్ మెంట్ ఇచ్చింది. కానీ వాస్తవంగా అది జరగడం లేదు. టిక్ టాక్ యాప్ లో యూజర్ల డేటాకు భద్రత లేదు. రీడ్ చేయడం, యాక్సెస్ చేయడం, చైనా సర్వర్లకు సమాచారాన్ని పంపడం, దొంగిలించడం వంటి టిక్ టాక్ యాప్ లో నిత్యకృత్యంగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

చైనాకు గట్టి షాక్ ఇచ్చిన భారత్:
గల్వాన్ లోయలో కుట్రపూరితంగా దాడి చేసి 20మంది భారత జవాన్లను బలితీసుకున్న చైనాకు డిజిటల్ రూపంలో భారత్ గట్టి షాక్ ఇచ్చింది. చైనా కంపెనీలకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించింది. దేశ రక్షణ, పౌరుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దేశ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Read :TikTokను తరిమేశారు.. ‘Chingari’ను ఆదరిస్తున్న భారతీయులు.. ప్లే స్టోర్‌లో 2.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్!