Tik Tok పిచ్చ : జెల్లీ ఫిష్ అనుకుని నాకబోయాడు..కాస్తుంటే చచ్చేవాడే..

Tik Tok పిచ్చ : జెల్లీ ఫిష్ అనుకుని నాకబోయాడు..కాస్తుంటే చచ్చేవాడే..

Tik Tok

TikTok man slimy creature mistaking jellyfish : టిక్ టాకర్స్ పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. డిఫిరెంట్ వీడియోస్ చేయాలని ఎక్కడలేని పిచ్చి పనులు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. అదిగో అచ్చు అటువంటి పనే చేయబోయాడు ఓ టిక్ టాకర్. జెల్లీ ఫిష్ అనుకుని ఓ అత్యంత ప్రమాదకరమైన జీవితో ఆటలాడాడు. కానీ భూమ్మీద ఇంకా నూకలున్నాయోమో..కాస్తలో బతికి బైటపడ్డాడు. బీచ్ లో తిరుగుతూ కంటికి ఇంపుగా కనిపించింది కదాని నీలం రంగులో ఉన్న ఓ ప్రాణిని పట్టుకున్నాడు.



దాన్ని పట్టుకుని టిక్ టాక్ వీడియో చేద్దామనుకున్నాడు. మిడి మిడి జ్నానంతో దాన్ని పట్టుకుని బిల్డప్ లిచ్చాడు. ‘‘ఇదిగో ఇది జెల్లీ ఫిష్..భలే ఉంది. దీన్ని నేను నాకుతా’ అంటూ ఫోజులు కొట్టాడు. కానీ అది జెల్లీ ఫిష్ కాదనీ..అదో ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన ప్రాణి అని తెలుసుకోకుండా ఓవర్ బిల్డప్ లిచ్చాడు. కానీ కాస్తలో బతికి బైటపడ్డాడు పోర్చుగీస్ లోని అలెక్సా రీడ్ అనే టిక్ టాకర్.

అలెక్సా సముద్రం ఒడ్డున తిరుగుతుండగా…అక్కడి నీళ్లల్లో నీలం రంగులో అందంగా, మృదువుగా ఉన్న ఓ ప్రాణి కనిపించింది. దాన్ని జెల్లీ ఫిష్ అనుకున్నాడా బడుద్ధాయి. దాంతో టిక్ టాక్ వీడియో చేద్దామనుకున్నాడు. దాన్ని నీళ్లలోంచి తీసి చేత్తో పట్టుకున్నాడు. దాంతో బిల్డప్ లు మొదలు పెట్టాడు.

‘ఓహ్ ఇది ఎంత బాగుందో..చూడండీ..ఇది జెల్లీ ఫిష్ చల్లగా మెత్తగా భలే బాగుందో..భలే భలే..ఎంత పెద్దదో చూడండీ..ఇది ఇంకా బతికే ఉంది. దీన్ని నేను నా చేతులతో నొక్కబోతున్నాను..నాలుకతో నాకబోతున్నాను..ఇదిగో..నాకుతున్నా..నాకేస్తున్నా..ఓ మై గాడ్.. దీనిని ఇప్పుడు నాకబోతున్నా’’ అంటూ ఎక్స్ ట్రాలు చేశాడు. కానీ అది జెల్లీ ఫిష్ కాదని తెలుసుకోలేక కాస్త అంటీ అంటనట్లుగా నాలుకతో నాకాడు. అలా అయ్యాక గురుడు పాపం నాకి చావు అంచులకు వెళ్లి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. అది ఓ ప్రమాదకర జీవి అనీ…తన ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జీవి అని తెలుసుకోలేకపోయాడు. అలా ఆ వీడియోను అలెక్జా రీడ్ పోస్టు చేశాడు.



నిజానికి అది జెల్లీ ఫిష్ కాదు. మనుషుల్ని చంపగలిగేంత శక్తి ఉన్న జీవి అది. దీనిని పోర్చుగీస్ మ్యాన్ ఓ’ అంటారు. దాన్ని ‘ఫ్లోటింగ్ టెర్రర్’ అని కూడా అంటారు. ఆ వీడియో వీడియో చూసిన నెటిజన్లు అలెక్సాను తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి..బతికి బైటపడ్డావు. దాన్ని కాస్త ఎక్కువగా నాలుక ఆనించి నాకి ఉంటే చచ్చేవాడివి..అది జెల్లీ ఫిష్ కాదు డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే అతను దాన్ని కాస్త అంటీ అంటనట్లుగా వీడియో కోసం నాకినట్లుగా నాకటంతో..అస్వస్థతకు గురయ్యాడు. కానీ తీవ్ర ప్రమాదం నుంచి బైటపడ్డాడు. దాన్ని బాగా నాకి ఉంటే ఏమయ్యేదో..

నీలం రంగులో అందంగా కనిపించే ఈ పోర్చుగీస్ మ్యాన్ ఓ’. ‘బ్లూ బాటిల్‌’, ‘ఫ్లోటింగ్ టెర్రర్’ అనే పేర్లతోనూ దీనిని పిలుస్తారు. ఒక్క ఆస్ట్రేలియాలోనే దీని బారిన పడ్డవారు చాలామంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లూ బాటిల్ అనే జీవి బారిన ఒక్క ఆస్ట్రేలియాలోనే సంవత్సరానికి 10 వేల మంది పడుతున్నారనీ..ఇది విషపూరితమైనదనీ..దీని విషం చాలా ప్రమాదకరమైనదని తెలిపారు. అది కుడితే బాధ మామూలుగా ఉండదనీ.. తీవ్రమైన బాధ మూడు రోజులుంటుందనీ… స్పృహ కోల్పోతారని తెలిపారు.



ఇది కుడితే సరైన సమయానికి వైద్యం అందకపోతే..ప్రాణాలే పోతాయని తెలిపారు. ఈ వింత ప్రాణి సిఫోనోఫోర్ జాతికి చెందినదని..ఇది కుడితే ప్రాణాలు పోవటం ఖాయమని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. దాని విషం చాలా ప్రమాదకరం. అది కుడితే గొంతువాపు, హృద్రోగ సమస్యలు, శ్వాసకోశ సమస్యలకు గురవుతారు..చనిపోవడం ఖాయం’’ అని చెప్పుకొచ్చారు.