Jehane Thomas: అరుదైన వ్యాధితో టిక్‌టాక్ స్టార్ మృతి.. ముప్పై ఏళ్లకే కన్నుమూసిన జెహానె థామస్
అయితే, కొంతకాలం క్రితం జెహానె థామస్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుధైన వ్యాధి ఆమెకు సోకింది. దీనివల్ల కంటిలో వాపు వంటి లక్షణాలు వస్తాయి. అలాగే తీవ్రమైన మైగ్రేన్ సమస్యను కూడా జెహానే ఎదుర్కొంది. దీనికోసం ఆమె ఇటీవలే సర్జరీ కూడా చేయించుకుంది.

Jehane Thomas: అమెరికాకు చెందిన టిక్‌టాక్ స్టార్ జెహానె థామస్ (30) అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు అలిక్స్ రీస్ట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జెహానె థామస్ టిక్‌టాక్‌లో బాగా ఫేమస్. టిక్‌టాక్ ద్వారా వేలాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
Rafael Nadal: టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్.. 2005 తర్వాత ఇదే తొలిసారి
అయితే, కొంతకాలం క్రితం జెహానె థామస్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుధైన వ్యాధి ఆమెకు సోకింది. దీనివల్ల కంటిలో వాపు వంటి లక్షణాలు వస్తాయి. అలాగే తీవ్రమైన మైగ్రేన్ సమస్యను కూడా జెహానే ఎదుర్కొంది. దీనికోసం ఆమె ఇటీవలే సర్జరీ కూడా చేయించుకుంది. సర్జరీ తర్వాత తాను చాలా కాలం నడవలేనని, వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి వస్తుందని గత వారమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. సర్జరీ తర్వాత ఇంటికి వెళ్లింది. అయితే, మళ్లీ విపరీతమైన మైగ్రేన్ రావడంతో తిరిగి ఆస్పత్రిలో చేరింది. కాగా, జెహానె అనారోగ్యంతోనే మరణించినట్లు తెలుస్తోంది.
Viral Video: కెమికల్స్‌లో ముంచిన కూరగాయలు.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్
మైగ్రేన్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్లే ఆమె మరణించి ఉండచ్చని సమాచారం. జెహానె థామస్‌కు వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒక బాబు వయసు మూడేళ్లుకాగా, మరో బాబు వయసు ఏడాది మాత్రమే. ప్రస్తుతం తల్లి లేని ఈ పిల్లల సంరక్షణ కోసం అలాగే, ఆమె అంత్యక్రియల కోసం జెహానె సన్నిహితులు విరాళాలు సేకరిస్తున్నారు. దీంతో చాలా మంది విరాళాల ద్వారా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
View this post on Instagram