మరో డేంజరస్ గేమ్: పబ్జి కన్నా ప్రమాదకరం.. బతికినా చచ్చినట్టే

సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌లు, గేమ్ లు వస్తున్నాయి. అందులో కొన్ని తెగ వైరల్‌ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 05:41 AM IST
మరో డేంజరస్ గేమ్: పబ్జి కన్నా ప్రమాదకరం.. బతికినా చచ్చినట్టే

సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌లు, గేమ్ లు వస్తున్నాయి. అందులో కొన్ని తెగ వైరల్‌ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు

సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌లు, గేమ్ లు వస్తున్నాయి. అందులో కొన్ని తెగ వైరల్‌ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు చూడటానికి ఉన్నా.. కొన్ని మాత్రం చాలా డేంజరస్. ప్రాణాలు తీస్తున్నాయి. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో(tiktok) వస్తున్న కొన్ని ఛాలెంజ్‌లు మరీ దారుణంగా ఉంటున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా వచ్చిన డేంజర్ గేమ్.. స్కల్ బ్రేకర్ ఛాలెంజ్(skull breaker challenge).

స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటే ఏమిటి?
స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ పేరిట సోషల్ మీడియాలో ఈ గేమ్ వైరల్ గా(viral) మారింది. ఈ గేమ్ పబ్జీ(pubg) కన్నా ప్రమాదకరమైంది. స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ ఆటలో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. అందరూ ఒకేసారి పైకి ఎగరాలి. అయితే ఇరు పక్కల ఉన్న వారు .. మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఎగిరిన సమయంలో వాళ్లు ఎగరకుండా.. చెరో కాలితో .. మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను ముందుకు తంతారు. దీంతో అతడు వెల్లకిలా పడిపోతాడు. ఫలితంగా భారమంతా నడుము, వెన్నుపూస, తలపై పడుతుంది. ఇది ప్రాణాంతకం. ఈ ఛాలెంజ్ కారణంగా.. వెన్నుముక, తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రాణం కూడా పోవచ్చన్నారు. ఒక వేళ బతికినా.. ఎందుకూ పని రాకుండా.. జీవితాంతం బెడ్ కే పరిమితం అయ్యే పరిస్థితి రావొచ్చన్నారు. వెన్నెముక దెబ్బతిన్నా.. తలకు గట్టిగా దెబ్బ తగిలినా.. మనిషి లేవ లేడని వైద్యులు చెబుతున్నారు.

వెన్నుముక, తలకు ప్రమాదం:
ఈ గేమ్ ప్రస్తుతం టిక్ టాక్ లో సర్క్యులేట్‌ అవుతోంది. యూత్ ఇప్పటికే ఈ గేమ్ ను ఫాలో అవుతుండడంతో వారికి గాయాలు అవుతున్నాయి. ఈ గేమ్ ఛాలంజ్ కి ఆదరణ పెరిగితే వెన్నుముక, తలకు తీవ్ర గాయలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి ప్రమాదకర గేమ్స్ జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే:
స్కూళ్లలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ గేమ్‌తో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరు మొదలు పెట్టినా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సరదాగా కూడా ఈ గేమ్ ఆడొద్దని పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాల్సిన అవసరం పెద్దలపై ఉంది. సరదాగా ఆడుకోవడంలో తప్పు లేదు. కానీ.. సరదా ముసుగులో ఇలాంటి ప్రాణాంతక గేమ్స్, ఛాలెంజ్ లు క్రియేట్ చేయడం సరికాదు. ప్రాణం విలువైనది. సరదా కోసమో, ఎంటర్ టైన్ మెంట్ కోసమో.. ఇలాంటి పిచ్చి గేమ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

Read More>>జామియా యూనివర్శిటీ హింసలో డ్యామేజ్ రూ. 2.66కోట్లు