India-China borderలో గొడవలు జరిగిన పరిస్థితి.. ఇలా

  • Published By: Subhan ,Published On : June 17, 2020 / 09:44 AM IST
India-China borderలో గొడవలు జరిగిన పరిస్థితి.. ఇలా

ఇండియా, చైనాల మధ్య సోమవారం సాయంత్రం నుంచి భయానక పరిస్థితులు మొదలయ్యాయి. 45సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాల కంటే ఎక్కువగా జరుగుతూ.. దాదాపు ఇండియా వైపు 20 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఓ కమాండ్ ఆఫీసర్ తో పాటు 43మందికి గాయాలకు గురయ్యారు. న్యూక్లియర్ పవర్ శక్తితో కూడిన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడూ తక్కువగానే ఉన్నాయి. 

వారాల వారీగా ఇండియా-చైనా మధ్య నెలకొన్న పరిస్థితులు:
మే 5-6: లడఖ్‌లోని పాంగాంగ్ త్సు సరస్సు ఒడ్డున ఇండియా, చైనా పాట్రోలింగ్ ల మధ్య హింసాత్మక ఘర్షణ మొదలైంది. సైనికుల మధ్య ఒకరికొకరు రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు ఇరు దేశ బలగాలపై వాదనలు మరింత బలపడేలా చేశాయి. ఈ దాడుల్లో ఇరువైపులా 250 మంది వరకూ గాయాలకు గురయ్యారు. 

మే 9: ఈస్టరన్ సెక్టార్ లోకి టెన్షన్లు వ్యాపించాయి. సిక్కిం నాకు లా ప్రాంతానికి ఉత్తర భాగంలో ఇండియా, చైనా సైనికుల మధ్య గొడవలు పెరిగాయి. ఎదురెదురుగా 150 మంది సైనికులు తలపడటంతో నలుగురు ఇండియన్లు, ఏడుగురు చైనా సైనికులకు గాయలైయ్యాయి. 

మే 10: ఆర్మీ వర్గాలు నాకు లా ప్రాంతం హింసను ప్రేరేపిస్తుందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాయి. పాంగాంగ్ త్సూ గొడవను ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.

మే 12: గాల్వాన్ లోయలో టెన్షన్ల ప్రకారం.. ఇరు దేశాల ఆర్మీ అగ్రెసివ్ బిహేవియర్ తో తలపడ్డారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద చైనాతో జరిగిన గొడవలు సద్దుమణగలేదు. 

మే 19: పాంగాంగ్ త్సూ సరస్సు వద్ద, గాల్వాన్ వద్ద టెన్షన్లు పెరుగుతుండటంతో చైనా విదేశాంగ శాఖ భారత బలగాలను ఎల్ఏసీ వద్దకు రావద్దంటూ హెచ్చరించాయి. బీజింగ్ అవసరమైన ప్రతిచర్యలు తీసుకుంటుందని వెల్లడించాయి. 

మే 21: లడఖ్, సిక్కిం సెక్టార్లలో చైనా చర్యలను ఇండియా బలంగా తిప్పికొట్టింది. విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఇండియా యాక్టివిటీలు పూర్తిగా భారత ఎల్ఏసీ వద్ద నుంచే జరుగుతున్నాయి. ఇండియా నిర్వహిస్తున్న నార్మల్ పాట్రోలింగ్ లో చైనా జోక్యం చేసుకుంటుందని చెప్పింది. 

మే 22: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానె సెన్సిటివ్ సెక్టార్ గా భావించి లె బేస్‌డ్ 14కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్ ను సందర్శించారు. ఇరు వైపులా మిలటరీ రీఇన్‌ఫోర్స్‌మెంట్ తో పాటు ట్రూప్ ను తయారుచేసుకున్నాయి. 

మే 25: చైనా మార్షల్స్ 5వేల మంది సైనికులను లడఖ్ సెక్టార్ బోర్డర్లో దింపింది. ఇండియా మిలటరీ అప్పటికే సిద్ధంగా ఉంది. 

మే 27: ఆర్మీ ఉన్నతాధికారులు చైనాతో సెక్యూరిటీ ఇష్యూలపై చర్చించారు. అప్పటికే ఇండియా, చైనా సైనికులు మల్టిపుల్ పాయింట్లను లాక్ చేసి ఉంచారు. 

మే 30: డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ ఇండియా, చైనా మిలటరీ, డిప్లమోటిక్ స్థాయి వారు మాట్లాడుకుని సమాధానం వెతుక్కుంటారు. ఇండియా హోదాను తగ్గించుకునేలా తామేం చేయమని చెప్పారు. 

జూన్ 2: ఎల్ఏసీ వద్ద చైనా బలగాలు మొహరించి ఉన్నాయని దానిక ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఇండియన్ ఆర్మీ బలగాలు రెడీగా ఉన్నాయని చెప్పారు. 

జూన్ 6: టాప్ మిలటరీ ఆఫీసర్స్ తో మీటింగ్ జరిగింది. ఇందులో లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, 14విభాగాలకు చెందిన కమాండర్లు, మేజర్ జనరల్ లూయ్ లిన్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ కమాండ్ర ప్లాన్ పై చర్చించారు. 

జూన్ 9: ఎల్ఏసీల వద్ద ఉన్న మూడు హాట్ స్పాట్లలో చైనా తమ బలగాలను వెనక్కు తీసుకున్నాయి. ఇండియా సైతం అదే పాయింట్ల వద్ద తమ బలగాలను తగ్గించేశాయి. మిలటరీలో అతి తక్కువ మందితో మాత్రమే గాల్వాన్ లోయ వద్ద పాట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 

జూన్ 10: ఇండియా, చైనాల డిలిగేషన్స్ మరో చర్చలు మొదలుపెట్టారు. మేజర్ జనరల్ ర్యాంక్ అధికారులు పాట్రోలింగ్ పాయింట్ 14 వద్ద సొల్యూషన్ కోసం మరోసారి మీటింగ్ లో పాల్గొన్నారు. ఎల్ఏసీ హాట్ స్పాట్ల వద్ద బలగాలను తగ్గించాలని ఇరు వైపుల నుంచి బలమైన వాదనలు వినిపించారు. ఇది ఈరు ఆర్మీల తరపున జరిగిన నాలుగో చర్చ. 

జూన్ 12: మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఐదోసారి కలిసి బోర్డర్ టెన్షన్లు తగ్గించుకునేందుకు చర్చించారు. ఎల్ఏసీలతో పాటు లోతుగా ఉన్న ప్రాంతాల్లో మొత్తం 8వేల బలగాలతో, ట్యాంకులతో, ఆర్టిల్లరీ గన్స్, ఫైటర్ బాంబులు, రాకెట్ బలగాలు, ఎయిర్ డిఫెన్స్ రాడార్లను చైనా వెనక్కు తీసుకుంది. 

జూన్ 13: దశల వారీగా జరిగిన వాదనను ఇండియా, చైనా బలగాలు తిరస్కరించాయి. ఎల్ఏసీ గుండా చైనాతో సంబంధాలు కంట్రోల్ లోనే ఉన్నాయి. 

జూన్ 15: ఇండియా, చైనాల మధ్య ఆర్మీ డిలిగేషన్స్ మరో సారి చర్చలకు దిగారు. ఎల్ఏసీ గుండా రెండు ప్రాంతాల్లో చర్చలు నిర్వహించారు. బ్రిగేడియర్ హోదా ఉన్న అధికారులు గాల్వాన్ లోయ, కల్నల్ ర్యాంక్ ఆఫీసర్స్ హాట్ స్ప్రింగ్స్ వద్ద చర్చల్లో పాల్గొన్నారు. రెండు చర్చలు ఒకే రోజు సాయంత్రం జరిగాయి. 

Read: వీర జ‌వాన్ ప‌ళ‌ని : గృహ‌ప్ర‌వేశం క‌న్నా దేశ‌మే ముఖ్యం