నేడు సంపూర్ణ చంద్రగ్రహణం : ప్రత్యేక కళ్లజోడు, టెలీస్కోపుల లేకుండా చూడొచ్చు

ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు మరింత ఇస్మార్ట్‌గా కనిపించబోతున్నాడు. ఈ దశాబ్దంలో తొలిసారి టోటల్‌ వ్యూ ఇవ్వబోతున్నాడు.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 04:37 AM IST
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం : ప్రత్యేక కళ్లజోడు, టెలీస్కోపుల లేకుండా చూడొచ్చు

ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు మరింత ఇస్మార్ట్‌గా కనిపించబోతున్నాడు. ఈ దశాబ్దంలో తొలిసారి టోటల్‌ వ్యూ ఇవ్వబోతున్నాడు.

ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు మరింత ఇస్మార్ట్‌గా కనిపించబోతున్నాడు. ఈ దశాబ్దంలో తొలిసారి టోటల్‌ వ్యూ ఇవ్వబోతున్నాడు. కాకపోతే ఈసారి తెల్లగా కాకుండా నారింజ వర్ణంలో కనువిందు చేయనున్నాడు. ప్రత్యేక కళ్లజోడు, టెలీస్కోపుల అవసరం లేకుండా నాన్‌ స్టాప్‌గా నాలుగు గంటల పాటు వీక్షించే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోవద్దని అస్ట్రో సైంటిస్టులు అంటున్నారు. 

భారత కాలమానం ప్రకారం శుక్రవారం (జనవరి 10, 2020) రాత్రి 10 గంటల 37 నిమిషాలకు ప్రారంభమై, రాత్రి 12 గంటల 31 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణంగా మారుతుంది. తెల్లవారుజామున 2 గంటల 32 నిమిషాలకు పూర్తవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం నాలుగు గంటలు. మొత్తం నాలుగు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. ఈ గ్రహణం భారత్‌తో పాటు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనువిందు చేయనుంది. అయితే ఈ ఏడాది జూన్‌లో రెండు గ్రహణాలున్నాయి. జూన్‌ 5న సంపూర్ణ చంద్రగ్రహణం, 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయి.

దేశవ్యాప్తంగా గురువారం(డిసెంబర్ 26, 2019) సూర్యగ్రహణం కనువిందు చేసింది. మూల నక్షత్రం ధనస్సు రాశిలో ఏర్పడిన కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం మూడు గంటల పాటు సాగింది. ఉదయం 8.03 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉ.11.11 గంటలకు ముగిసింది. భారత్‌ తోపాటు ఆసియాలోని పలు దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది.