Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులకు రూ.2లక్షల 23 వేల కోట్లకుపైగా నష్టం

ఒలింపిక్స్ ఆరంభ సీజన్ నుంచి భారీగా లాభాలు దండుకుంటుంది. 1960 నుంచి ప్రతి సీజన్ లోనూ సగటు ఆదాయం కంటే 172శాతం ఎక్కువగానే ఆర్జిస్తుంది. ప్రస్తుత సీజన్ 2020 టోక్యో ఒలింపిక్స్ కు మాత్రం లాభం కంటే ఖర్చే ఎక్కువగా ఉందట.

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులకు రూ.2లక్షల 23 వేల కోట్లకుపైగా నష్టం

Tokyo Olympic Games

Tokyo Olympics: ఒలింపిక్స్ ఆరంభ సీజన్ నుంచి భారీగా లాభాలు దండుకుంటుంది. 1960 నుంచి ప్రతి సీజన్ లోనూ సగటు ఆదాయం కంటే 172శాతం ఎక్కువగానే ఆర్జిస్తుంది. ప్రస్తుత సీజన్ 2020 టోక్యో ఒలింపిక్స్ కు మాత్రం లాభం కంటే ఖర్చే ఎక్కువగా ఉందట. ఒరిజినల్ బడ్జెట్ కంటే 400శాతం ఖర్చు పెట్టారు నిర్వాహకులు. అదంతా తిరిగి వస్తుందనే నమ్మకం కూడా లేదు.

కరోనా మహమ్మారి కారణంగా సమ్మర్ గేమ్స్ కూడా బడ్జెట్ కు మించే జరిగాయి. ముందుగా ప్లాన్ చేసిన దానికంటే ఇప్పుడు చేస్తున్న ఖర్చు 800మిలియన్ డాలర్లు దాటుతుంది. ఈ మెగా టోర్నీని వాయిదా వేయడం టోక్యో ఆర్గనైజింగ్ కమిటీకి ఖర్చు పెంచేసింది. పెట్టిన పెట్టుబడితో గతంలోని టోర్నీల ప్రకారం అంచనావేసి వస్తుందని భావించిన దానిలో భారీగా అంటే దాదాపు రూ.223లక్షల కోట్లకు పైగానే నష్టం రానుందట.

సర్కస్ మాగ్జిమస్ అనే కథనంలో స్మిత్ కాలేజి ఎకనామిక్స్ కు చెందిన ఆండ్రూ జింబాలిస్ట్ ఇలా రాసుకొచ్చారు. ఒలింపిక్స్, వరల్డ్‌కప్ టోర్నీలు నిర్వహించిన ఆర్గనైజింగ్ కమిటీ ప్లాన్ ప్రకారం.. 7.3బిలియన్ డాలర్లు అవుతుందని భావించిన బడ్జెట్ 35 బిలియన్ డాలర్లకు చేరిందట.

పెట్టిన ఖర్చు అంతా లాభాలు అంటే డొమెస్టిక్ పార్టనర్‌షిప్, లైసెన్సింగ్ అగ్రిమెంట్స్, టిక్కెట్ సేల్స్, టూరిజం అభివృద్ధి ద్వారా తిరిగి చెల్లించాలి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ క్రీడలు చూడటానికి వీల్లేదంటూ విదేశీ అభిమానులను బ్లాక్ చేసింది జపాన్. ఇందుకోసం బుక్ చేసుకున్న టిక్కెట్లకు రీఫండ్ కూడా ఇచ్చింది. ఈ కారణంగా 3బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.

ఐఓసీ మీడియా హక్కులు మాత్రమే అట్టిపెట్టుకుని ఇంటర్నేషనల్ స్పాన్సర్ల నుంచి రెవెన్యూ రాబట్టుకుంటుంది. టీవీ రైట్స్, ఇంటర్నేషనల్ స్పాన్సర్ షిప్ రైట్స్ ద్వారా 5బిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని అన్నారు. గేమ్స్ జరుగుతున్నంత కాలం ఎటువంటి ప్రభావం ఉండదు. టోర్నీ పూర్తయ్యాకే లోటుపాట్లు బయటికొచ్చేది.

‘గేమ్ కు సంబంధించిన టిక్కెట్లు అమ్మడానికి వీల్లేదన్నప్పుడు.. యూఎస్ఏ బాస్కెట్‌బాల్ టీం ఆడుతున్నా.. హై స్కూల్ టీం ఆడుతున్నా ఎటువంటి తేడా లేదు. టికెట్ రెవెన్యూ ఊహించిన దానికంటే చాలా తక్కువగా నమోదవుతున్నాయి’ అని నిపుణులు అంటున్నారు.

ప్రపంచమంతా టోక్యో ఒలింపిక్స్ విజయాల గురించి గమనిస్తుంటే.. స్థానికులేమో టోర్నీ ఇక్కడ నిర్వహించొద్దని మొత్తుకుంటున్నారు. నిర్వహణకు అయిన ఖర్చు మొత్తం ప్రజల నుంచే వసూలు చేస్తారని మెగా ఈవెంట్ తర్వాత పరిస్థితులు దారుణంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.