Madhuri Dixit song in Olympics : ఒలింపిక్స్ లో మాధురి దీక్షిత్ పాట..సోషల్ మీడియాలో వైరల్

టోక్యో ఒలింపిక్స్ బాలివుడ్ నటి..అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ పాటు వినిపించటంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన భారత్ కు చెందిన బాలివుడ్ నటి పాట ఎక్కడో జపాన్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో వినిపించటం ఏంటీ? ఎందుకు అక్కడ మాధురీ దీక్షిత్ పాట ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Tokyo Olympics with Bollywood actress Madhuri Dixit song : టోక్యో ఒలింపిక్స్ బాలివుడ్ నటి..అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ పాటు వినిపించటంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన భారత్ కు చెందిన బాలివుడ్ నటి పాట ఎక్కడో జపాన్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో వినిపించటం ఏంటీ? ఎందుకు అక్కడ మాధురీ దీక్షిత్ పాట వినిపిస్తోంది.ఆ పాట ఏంటీ ఎవరు పాడారు?ఎందుకు పాడారు?ఏ సందర్భంలో పాడారు? అనే ఎన్నో డౌట్లు వస్తేస్తున్నాయి. ఆహ్లాదకరమైన బాలీవుడ్ సినిమా పాట..మాధురీ దీక్షిత్ పాట ఒలింపిక్స్‌లో వినిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అసలు విషయం ఏంటంటే..ఆర్టిస్టిక్ స్విమ్మింగ్‌ విభాగంలో బరిలో నిలిచిన ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా స్విమ్మర్లు.. మాధురీ దీక్షిత్ పాట ‘ఆజ నాచ్ లే’ పాటను ప్రదర్శించారు. టోక్యోలో డ్యూయెట్ టెక్నికల్ రొటీన్ ఫైనల్ ఈవెంట్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఇజ్రాయెల్ మహిళా స్విమ్మర్లు ఈడెన్ బ్లెచర్, షెల్లీ బొబ్రిస్కీ పోటీపడుతున్నారు. వారిద్దరూ మాధురీ దీక్షిత్ పాటపై అద్భుతమైన రిథమిక్ స్విమ్మింగ్ చేశారు. దీంతో ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ పాట ఆదిత్య చోప్రా నిర్మించగా.. అనిల్ మెహతా దర్శకత్వం వహించిన ‘ఆజ నాచ్ లే’ చిత్రంలోనిది. మాధురితో పాటు కొంకణ సేన్ గుప్తా, అక్షయ్ ఖన్నా, జుగల్ హంసరాజ్, కునాల్ కపూర్ వంటి నటులు ఉన్నారు. అమెరికన్ కొరియోగ్రాఫర్ పాత్రను మాధురీ దీక్షిత్‌ పోషించిన ఈ పాట ఒలింపిక్స్ లో వినిపించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బాలివుడ్ పాటను ఒలింపిక్స్ లో రిథిమ్ చేసినందుకు ఇజ్రాయెల్‌ స్విమ్మర్లకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు నెటిజన్లు. ‘మా అభిమాన నటి మాధురీజీ నటించిన ఈ పాటను ప్రదర్శించినందుకు ఇజ్రాయెల్ స్విమ్మర్లకు ధన్యవాదాలు. ఇది చూడటానికి, వినడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.కాగా.. ఈ పోటీలో ఇజ్రాయెల్ స్విమ్మర్లు 15 వ స్థానంలో నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు