Taliban vs ISIS: అఫ్ఘానిస్తాన్‌లో ఇద్దరు ఐసీస్ కమాండర్లను మట్టుబెట్టిన తాలిబన్లు
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్‌ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్‌లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్‌లో రెండు దశాబ్దాలుగా వెతుకుతున్నారు

Top Islamic State commanders killed by Taliban forces in Afghanistan
Taliban vs ISIS: కొద్ది రోజుల క్రితం రాజధాని కాబూల్‌లో ఉగ్రవాద నిరోధక దాడిలో తమ భద్రతా దళాలు ఇద్దరు కీలక ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను హతమార్చాయని అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది. హతమైన టెర్రరిస్టులలో ఒకరు ఖరీ ఫతే ఇంటెలిజెన్స్ చీఫ్ కాగా, మరొకరు ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ మాజీ యుద్ధ మంత్రని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఐఎస్కేపీ అనేది ఇస్లామిక్ స్టేట్ యొక్క అఫ్ఘాన్ అనుబంధ సంస్థ అని, ఇది తాలిబాన్‌కు కీలక విరోధని అన్నారు.
Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెం.1 స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్
ఐఎస్‌కేపీకి ఖరీ ఫతే ప్రధాన వ్యూహకర్తగా నివేదించబడ్డాడని, కాబూల్‌లోని రష్యన్, పాకిస్తానీ, చైనా దౌత్య కార్యకలాపాలతో సహా అనేక దాడులకు ప్రణాళిక వేస్తున్నారని తమకు సమాచారం అందిందని ముజాహిద్ తెలిపారు. ఎజాజ్ అహ్మద్ అహంగర్ అనే వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ హింద్ ప్రావిన్స్ మొదటి ఎమిర్ అని, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐఎస్కేపీ సీనియర్ నాయకుడిగా తన ఇద్దరు అనుచరులతో రహస్య నివాసం పొందినట్లు ముజాహిద్ పేర్కొన్నారు.
Adani Group: మార్చిలో 6.5 వేల కోట్ల రుణాలు చెల్లించేందుకు సిద్ధమైన అదానీ గ్రూప్
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్‌ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్‌లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్‌లో రెండు దశాబ్దాలుగా వెతుకుతున్నారు. 2020 మార్చిలో కాబూల్‌లోని గురుద్వారా కార్ట్-ఇ పర్వాన్ వద్ద సెక్యూరిటీ గార్డు సహా 24 మంది ప్రాణాలను బలిగొన్న ఆత్మాహుతి బాంబు దాడికి ప్రధాన సూత్రధారి అహంగర్ అని అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అతనికి అల్-ఖైదా సహా ఇతర ప్రపంచ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.