Dowry Harrassment: అమెరికా వెళ్లినా అదే రచ్ఛ.. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే మన్‌దీప్ కౌర్ (30) కొన్నేళ్లుగా గురవుతున్న గృహ హింసకు, వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తప భర్త రంజోద్‌బీర్ సింగ్ సంధు కారణంగా వేధింపులకు గురయ్యానని వీడియోలో చెప్తూ ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. మృతురాలి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నౌర్ జిల్లాలో ఉండేది.

Dowry Harrassment: అమెరికా వెళ్లినా అదే రచ్ఛ.. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య

Suicide

Dowry Harrassment: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే మన్‌దీప్ కౌర్ (30) కొన్నేళ్లుగా గురవుతున్న గృహ హింసకు, వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తప భర్త రంజోద్‌బీర్ సింగ్ సంధు కారణంగా వేధింపులకు గురయ్యానని వీడియోలో చెప్తూ ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. మృతురాలి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నౌర్ జిల్లాలో ఉండేది.

తన ఆరేళ్లు, నాలుగేళ్లు వయస్సున్న ఇద్దరు కూతుళ్లను రంజోద్‌బీర్ సింగ్ సంధు నుంచి దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. ఆమె కోరిక మేరకు మృతురాలి సోదరురాలు కుల్దీప్ కౌర్ వారిని తన వద్దే ఉంచుకుంటానని చెప్తున్నారు.

“ఆమె భర్తకు కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నా. అతనికి మరణ శిక్ష విధించాలి. న్యాయం చేకూర్చాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. కొడుకుని కనాలంటూ ఆమె భర్త సంవత్సరాలుగా టార్చర్ చేస్తున్నారు. అయినప్పటికీ భర్తను వదిలేయనంటూ ఇద్దరు కూతుళ్లను పెంచుకుంటుంది” అని మృతురాలి కుటుంబీకులు చెప్తున్నారు.

Read Also : వరకట్న వేధింపులు.. ఐదు నెలల గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య

ఇద్దరు కూతుళ్లను పెంచేందుకుగానూ మణ్‌దీప్ కౌర్ కుటుంబం రూ.50లక్షలు డిమాండ్ చేసింది. ఆ డబ్బులిస్తే ట్రక్ పేరిట ఉన్న లోన్ తీర్చుకుంటానని అలా కూతుళ్ల ఖర్చుల కోసం డబ్బులు సమకూరుతాయని ఇవ్వమన్నాడని బాధితురాలి తండ్రి చెప్తున్నారు.

మృతురాలి అన్న సందీప్ సింగ్ కౌర్ మాట్లాడుతూ.. అత్తింటి వారు కొడుకు కోసం అడుగుతూ ఇబ్బంది పెడుతుండగా న్యూయార్క్‌లో కేసు పెడతామని బెదిరించేసరికి వెనక్కుతగ్గారు. ఆ తర్వాత తన భర్తను కాపాడాలంటూ మా చెల్లినే రిక్వెస్ట్ చేసింది” అని వెల్లడంచారు.

ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో పోస్ట్ చేసింది. తన చావుకు తన భర్త, అత్తింటి వారే కారణమని.. బతికి ఉన్నంతవరకూ టార్చర్ పెడుతూనే ఉన్నారని, 8ఏళ్లుగా శారీరక హింసకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.

“ఎనిమిదేళ్లుగా నా భర్త టార్చర్ ఎదుర్కొంటున్నా. ఏదో ఒక రోజు మారతాడని ఆశించా. నా వరకూ ఏది మంచిదో అదే చేశా. రోజూ తిడుతూనే ఉన్నారు. ఇది నేను భరించలేకపోతున్నా. తన ఎఫైర్లను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు. చనిపోయేందుకు ప్రేరేపించారు. నా పిల్లలను ఈ ప్రపంచంలో వదిలి వెళ్లిపోయేలా చేశారు” అని వాపోయింది.