Corona : జంతువులను వదలని కరోనా.. సింహాలు, చిరుతలులకు పాజిటివ్

జంతువులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక జూలలో జంతువులు కరోనా బారిన పడుతున్నాయి.

Corona : జంతువులను వదలని కరోనా.. సింహాలు, చిరుతలులకు పాజిటివ్

Corona

Corona :  జంతువులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక జూలలో జంతువులు కరోనా బారిన పడుతున్నాయి. పెట్ డాగ్స్, క్యాట్స్‌లో కూడా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా బ్రిటన్ లో ఓ పెంపుడు కుక్కకు కరోనా నిర్ధారణ అయిన విషయం మరువక ముందే ఎనిమిది పులులకు కరోనా సోకింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది పులులకు కరోనా బారినపడినట్లు జూ అధికారులు తెలిపారు.

చదవండి : India Corona cases: బీ కేర్‌ఫుల్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

వీటితోపాటు కరోనా సోకిన వాటిలో మరో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్‌ టైగర్‌, ఒక పూమా, రెండు జాగ్వార్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో స్వల్ప లక్షణాలు ఉండగా, మరికొన్ని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాయని జూ అధికారులు తెలిపారు.

చదవండి : Corona Virus: కరోనా వైరస్ ఆనవాళ్లు చెబితే.. రూ.11.5లక్షల బహుమతి ఇస్తామంటోన్న చైనా

జూలోని మిగతా జంతువులు క్షేమంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు అధికారులు. వీటికి కరోనా ఎలా సోకిందనే విషయాన్నీ జూ సిబ్బంది ఇంకా గుర్తించలేదు. జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ఎక్కడ నిర్దారణ కాలేదని.. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (CDC) వెల్లడించింది.

చదవండి : AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

కానీ ప్రజల నుంచి జంతువులకు వైరస్‌ వ్యాప్తిచెందుతున్నట్లు ఆధారాలున్నాయని తెలిపింది. కరోనా సోకిన జంతువులను వేరు చేసి ప్రత్యేక గదులకు షిఫ్ట్ చేసినట్లు వివరించారు. జూలోని జంతువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.