Human Skulls wall : వందలాది పుర్రెలతో కట్టిన టవర్..

పుర్రెలతో కట్టిన టవర్ ఎన్నో అనుమానాలను వ్యక్తంచేస్తోంది. శత్రువుల్ని చంపి వారి పుర్రెలతో టవర్ కట్టేశారా?లేదా నరబలి ఇచ్చి వారి పుర్రెలతో కట్టేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 15వ శతాబ్దంలో కట్టిన ఈ పుర్రెల టవర్ పై ఎన్నో పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి.

Human Skulls wall : వందలాది పుర్రెలతో కట్టిన టవర్..

Wife Chief In Same Office..husband Sweeper (1)

Human Skulls wall in Mexico : ఇంటి గోడలైనా..ప్రహరీ గోడలైనా, కోట గోడలైనా, టవర్ లైనా ఇటుకలతోనో..లేదా రాతితోనే కడతారు. వెదురు గడలతోను..లేదా బాటిల్స్ లో కట్టిన గోడల్ని కూడా చూసే ఉంటాం.కానీ ఏకంగా మనిషి పుర్రెలతో (కపాలాలు) నిర్మించిన గోడలను గానీ, టవర్ లను గానీ ఎప్పుడన్నా చూశారా? పోనీ కనీసం విన్నారా? అంటే ఏంటీ..మనిషి పుర్రెలతో గోడలా? అని నోరెళ్లబెడతాం.కానీ అటువంటి టవర్ ఇటీవల బైటపడింది. ఎప్పుడో 15వ శతాబ్ధంలో నిర్మించిన పురానత టవర్ బయటపడింది. ఆ గోడల నిండా పుర్రెలే ఉన్నాయి. ఇటుకలతో నిర్మించాల్సిన టవర్ నిండా మనిషి పుర్రెలే ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోయారు. పలు అనుమానాలు వ్యక్తంచేశారు. నరబలులు ఇచ్చి పుర్రెలతో టవర్ లా కట్టేశారా? అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు పరిశోధకులు.

మెక్సికోలోని మెట్రోపాలిటన్ కేథడ్రల్ సమీపంలో 15వ శతాబ‍్దానికి చెందిన ఓ పురాతన టవర్ బయటపడింది. దాన్ని చూసి పురాతత్వ శాస్త్రవేత్తలు షాకయ్యారు. ఎందుకుంటే ఈ టవర్ గోడల్లో వరుసగా పుర్రెలు పేర్చి ఉన్నాయి. వీటిలో మహిళలు, పురుషుల పుర్రెలతో పాటు చిన్నారుల పుర్రెలు కూడా ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఏ దేవతనైనా పూజించి ఆ దేవతకు పూజ సందర్భంగా వీరందరిని బలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అలాగే వీరిలో ఎక్కువ మంది శత్రు సైనికులు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ పుర్రెల తలలను బట్టి..దంతాల సైజు ఆధారంగా ఈ పుర్రెల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ టవర్ గోడ 2017లోనే బయటపడిందని.. గతంలో కొన్ని పుర్రెలని గుర్తించగా.. ఇప్పుడు మరో 114 పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు. అలా ఇప్పటి వరకు 600 వందల పుర్రెలు బయటపడ్డాయని తెలిపారు.

కాగా ఆయా పరిస్థితులను బట్టి..చరిత్రను బట్టి అజ్టెక్‌ సామ్రాజ్యాధిపతి తన ప్రత్యర్థులను హెచ్చరించటానికి ఈ గోడ నిర్మించాడని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే..స్పానిష్‌ ఆక్రమణదారులు 1521లో అజ్టెక్‌ సామ్రాజ్యాన్ని కూలదోశారు. ఇక టవర్ గోడ నిర్మాణంలో వెలుగు చూసిన పుర్రెల్లో ఎక్కువ భాగం శత్రు సైనికులవి కాగా.. మరి కొన్ని సాధారణ ప్రజలవి అయి ఉండవచ్చని.. వీరందరిని దేవుడికి బలి ఇచ్చి ఉంటారని..ఈ గోడని 15వ శతాబ్దం చివర్లో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆధునిక మెక్సికో నగరంలోని చారిత్రాత్మక జిల్లా అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ ప్రధాన ఆలయాలలో ఒకటైన టెంప్లో మేయర్ ప్రాంతంలో ఉంది.