థాయ్ మసాజ్ పుట్టింది భారత్‌లోనే..

థాయ్ మసాజ్ పుట్టింది భారత్‌లోనే..

బాడీ మసాజ్‌లో టెక్నిక్‌లైన ఒళ్లు పట్టడం, మోకాళ్లలో పటుత్వాన్ని పెంచే పద్ధతులు థాయ్ మసాజ్‌లో ఫ్యామస్. ఈ మసాజ్ యునెస్కో హోదా దక్కించుకుంది. జీవన పరిణామంలోని పలు అంశాల్లో వారసత్వ సంపద అంశంలో ఈ హోదా దక్కింది. తరాలు మారుతున్నప్పటకీ ఈ పద్ధతిని ఆచారంగా అనుసరిస్తున్నారు. 

యునెస్కో కేటగిరీలో గతంలో సంప్రదాయ సంపద కింద 550రకాలు ఉండేవి. తాజాగా 2019లో ఐరీష్ హార్పింగ్‌ను చేర్చారు. పోర్చుగల్‌లో పోర్చుగల్ కార్నివల్ ఆఫ్ పోడెన్స్, మలేసియా నుంచి సెల్ఫ్ డిఫెన్స్‌లను చేర్చారు. వీటితో పాటు థాయ్ మసాజ్‌కు యునెస్కో హోదా లభించింది. 

భారత్‌లో పుట్టిన ఈ మసాజ్ థాయ్ లో ఫ్యామస్ అయింది. 2వేల 500 సంవత్సరాల క్రితం భారత డాక్టర్లు, సాధువులు దీనిని వ్యాప్తి చేశారు. గుడుల్లో, కుటుంబాల్లో చెప్పిన వివరాలను క్రమంగా పాకిపోయాయి. 1962లో స్కూల్ పెట్టి మసాజ్ థెరపిస్ట్‌లను తయారుచేశారు. 145దేశాల్లో 2లక్షల మంది థెరిపిస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు.