Cambodia: దక్షిణ కంబోడియాలో విషాదం.. నదిలో పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు మృతి

దక్షిణ కంబోడియాలో నదిని దాటుతున్న క్రమంలో పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా 12 నుంచి 14ఏళ్ల వయస్సు కలిగిన వారు.

Cambodia: దక్షిణ కంబోడియాలో విషాదం.. నదిలో పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు మృతి

Cambodia

Cambodia: దక్షిణ కంబోడియాలో నదిని దాటుతున్న క్రమంలో పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా 12 నుంచి 14ఏళ్ల వయస్సు కలిగిన వారు. వీరు పాఠశాల నుండి తిరిగి నమ్‌పెన్‌కు ఆగ్నేయంగా మెకాంగ్ నదిపై గురువారం రాత్రి సమయంలో వస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో పది మంది మరణించగా, నలుగురు వ్యక్తులు, ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు పడవ సిబ్బందిని రక్షించారు. ఒక విద్యార్థి ఆచూకీ దొరకలేదని అక్కడి పోలీసులు తెలిపారు.

Uttar Pradesh: బీఎండబ్ల్యూ కారు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

కండల్ ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ మేజర్ జనరల్ చోయున్ సోచెట్ తన ఫేస్‌బుక్ పేజీలో ప్రమాద విషయాన్ని పేర్కొన్నారు. పడవ ప్రమాదం సమయంలో పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని, కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఎవరూ వేసుకోలేదని తెలిపారు. పడవ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు, పడవ యజమానులు, సిబ్బంది గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, పడవ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు చీఫ్ అంథౌ చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

పడవ ప్రమాదం నుంచి 12ఏళ్ల విద్యార్థిని ప్రాణాలను దక్కించుకుంది. నదికి సమీపంలో ఆ విద్యార్థిని నివాసముంటున్నప్పటికీ ఈత రాదు. పడవ కిందికి వెళుతున్నప్పుడు, విద్యార్థిని ముఖంపైకి లేపి ఈత కొట్టడానికి ప్రయత్నించి, నది ఒడ్డుకు దూకింది. దీంతో స్థానిక అధికారులు బాలికను రక్షించారు. పడవ ప్రమాదంపై ప్రధాన మంత్రి హున్ సేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.