Leopard : కన్నీరు పెట్టిస్తున్న చిత్రం.. చిరుత నోట్లో తల్లి కోతి.. పొట్టను పట్టుకున్న పిల్ల కోతి

ఏ జీవైనా తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. తమ పిల్లలకు చిన్న గాయమైన తల్లి విలవిలలాడుతోంది.

Leopard : కన్నీరు పెట్టిస్తున్న చిత్రం.. చిరుత నోట్లో తల్లి కోతి.. పొట్టను పట్టుకున్న పిల్ల కోతి

Leopard2

Leopard : ఏ జీవైనా తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. తమ పిల్లలకు చిన్న గాయమైన తల్లి విలవిలలాడుతోంది. ఇక పిల్లల విషయంలో కోతులు తీసుకునే జాగ్రత్త చాలా బిన్నంగా ఉంటుంది. తమ పిల్లలను పొట్టకింద పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. కొండలు గుట్టలు ఎక్కుతుంటాయి. ఆహారం కోసం బిడ్డలను తీసుకోని కిలోమీటర్ల మేర వెళ్తుంటాయి. అయితే కొన్ని సమయాల్లో ఇవి క్రూర జంతువులకు ఆహారమవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న చిత్రంలో తల్లి కోతి చిరుత చేతిలో చనిపోతుంది. అది తెలియని పిల్లకోతి ఆ తల్లి పొట్టను పట్టుకొని అలానే ఉంటుంది.

చదవండి : Leopard Attack : ఏడేళ్ల బాలికపై చిరుత దాడి

 

ఇక చిరుత ఆ కోతిని నోటకరిచి తీసుకెళ్తున్నా అలానే తల్లినిపట్టుకొని ఉంది ఆ చంటి పిల్ల. జాంబియా నేషనల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. తల్లి మరణించిందన్న సంగతి తెలియని కోతిపిల్ల అలానే తల్లిని పట్టుకొని ఉండటం కొందరిని కంటతడి పెట్టిస్తుంది. అయితే ఆ కోతి పిల్లను కూడా ఆ చిరుత చంపినట్లు షఫీక్ తెలిపాడు.

చదవండి : Leopard Cub : చిరుతను దుప్పట్లో చుట్టేసిన మహిళ..! సో గ్రేట్ అంటున్న అధికారులు, జనాలు