Dogs Sniff Out Covid : ఈ కుక్కలు.. కరోనాను బాధితులను ఇట్టే పట్టేస్తాయి

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వారికి చికిత్స అందించాలి. అప్పుడే ఈ మహమ్మారిని ఇతరులకు వ్యాపించకుండా చూడొచ్చు.

Dogs Sniff Out Covid : ఈ కుక్కలు.. కరోనాను బాధితులను ఇట్టే పట్టేస్తాయి

Dogs Sniff Out Covid

Dogs Sniff Out Covid 19 : కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వారికి చికిత్స అందించాలి. అప్పుడే ఈ మహమ్మారిని ఇతరులకు వ్యాపించకుండా చూడొచ్చు.

కరోనా సోకిన చాలామంది హోం ఐసోలేషన్ లో ఉండకుండా బయట తిరుగుతుండటం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగిపోతోంది. కొందరికేమో.. లక్షణాలు లేకపోవడం వల్ల తాము కరోనా బారిన పడ్డామనే విషయాన్ని గుర్తించడం లేదు. దీంతో.. వారికి తెలియకుండానే.. వైరస్ ని వ్యాపింపచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. కరోనా రోగులను గుర్తించడం కూడా కష్టంగానే ఉంది. కరోనా టెస్టు చేయించుకున్న 24గంటలకు గానీ.. రిజల్ట్ రావడం లేదు. ఈ లోపు జరగాల్సిన వ్యాప్తి జరిగిపోతోంది. ఈ కారణాల వల్ల రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు కుక్కలు వచ్చేశాయి. ఏంటి నమ్మబుద్ది కావడం లేదా? కానీ ఇది నిజం. ఈ కుక్కలు సాక్కుల వాసన చూసి కరోనా రోగులను ఇట్టే పట్టేస్తాయి. లక్షణాలే లేని వారిని కూడా.. వారిలో వైరస్ ఉంటే చాలు వెంటనే పసిగడుతున్నాయి.

ఈ మేరకు బ్రిటన్ లో కుక్కలకు కరోనా వైరస్ రోగులకు గుర్తించేందుకు శిక్షణ కూడా ఇచ్చేశారు. దాదాపు 90శాతం కచ్చితత్వంతో కరోనా రోగులను ఈ కుక్కలు వెంటనే గుర్తుపట్టేస్తున్నాయి. వారికి కరోనా లక్షణాలు లేకున్నా గుర్తు పట్టేస్తుండటం విశేషం.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, డర్హామ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఈ పరిశోధన కోసం ఏకగా 500,000 పౌండ్లను బ్రిటన్ కేటాయించింది. నిజానికి.. ఇప్పటికే కుక్కలు క్యాన్సర్‌, మలేరియా వంటి వ్యాధుల బారిన పడిన వారిని గుర్తిస్తున్నాయి.

అదే నమ్మకంతో ఇప్పుడు కరోనా వైరస్‌ను గుర్తించేందుకు వాటికి శిక్షణ ఇస్తున్నారు పరిశోధకులు. తమ ప్రయత్నం కచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి జేమ్స్ బెథెల్ చెప్పారు. ఒక కుక్క గంటకు 250మందిని పరీక్షిస్తుందన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఎయిర్ పోర్టుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఇక అమెరికా, ఫ్రాన్స్ పరిశోధకులు కూడా కరోనా వ్యాధిని గుర్తించడానికి కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే క్యాన్సర్‌ నిర్ధారణ కోసం పలు దేశాల్లో శునకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ట్యూమర్స్‌, క్యాన్సర్‌ పసిగట్టేందుకు శునకాలు వాడేవారు. ఆ తర్వాత డయాబెటిస్‌ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా వాడుతున్నారు. ఇప్పుడు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరోనా రోగుల నిర్ధారణకు కూడా వినియోగించుకోవచ్చని లండన్‌ పరిశోధకులు అంటున్నారు. పేలుడు పదార్థాలు, బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించడంలో శునకాలు కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.