Covid PPE killing animals: హృదయవిదారకం… మనిషి ప్రాణాలు కాపాడుతున్న మాస్కులు, పీపీఈ కిట్లు.. వాటిని మాత్రం చంపేస్తున్నాయి..

మనిషి వేటిని అయితే రక్షణ కవచాలు అంటున్నాడో, ఏవైతో తమ ప్రాణాలు కాపాడుతున్నాయో అని నమ్ముతున్నాడో.. ఇప్పుడవే.. ప్రాణాంతకంగా మారాయి. వాటి పాలిట మృత్యువులా మారాయి. వాటి ప్రాణాలు తోడేస్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా..

Covid PPE killing animals: హృదయవిదారకం… మనిషి ప్రాణాలు కాపాడుతున్న మాస్కులు, పీపీఈ కిట్లు.. వాటిని మాత్రం చంపేస్తున్నాయి..

Covid Ppe Killing Animals

Covid PPE killing animals : ప్రస్తుతం ప్రపంచానికి కరోనావైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా దెబ్బకు లక్షలమంది బలయ్యారు. ఏడాదిన్నర కావొస్తోంది. వ్యాక్సిన్ కూడా వచ్చింది. అయినా కోవిడ్ భయాలు మాత్రం తొలగలేదు. ఇంకా భయంభయంగానే బతకాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కరోనా నుంచి మనిషి ప్రాణాలు కాపాడుతున్నవి కొన్ని ఉన్నాయి. అవే మాస్కులు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లోవ్స్. ప్రస్తుతం మానవాళి.. వీటి వల్లే కరోనా నుంచి తమను తాము కాపాడుకుంటోంది. కోవిడ్ నుంచి మనిషిని కాపాడే రక్షణ కవచాలు ఏవైనా ఉన్నాయా అంటే.. అవి ఇవే అని చెప్పాలి.

మూగజీవాలు, జలచరాల పాలిట మృత్యువులా మారిన వ్యర్థాలు:
అయితే.. మనిషి వేటిని అయితే రక్షణ కవచాలు అంటున్నాడో, ఏవైతో తమ ప్రాణాలు కాపాడుతున్నాయో అని నమ్ముతున్నాడో.. ఇప్పుడవే.. ప్రాణాంతకంగా మారాయి. వాటి పాలిట మృత్యువులా మారాయి. వాటి ప్రాణాలు తోడేస్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా.. మూగజీవాలు, వన్య ప్రాణులు, జలచరాలు. అవును.. వాడి పడేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లోవ్స్.. జంతువుల పాలిట మరణశాసనంగా మారాయి. వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారాయి.

హ్యాండ్ గ్లోవ్ లో చేప, పెంగ్విన్ కడుపులో మాస్కు:
నెదర్లాండ్స్ లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఓ చేప హ్యాండ్ గ్లోవ్ లో చిక్కుకుని చనిపోయింది. బ్రెజిల్ లో ఓ పెంగ్విన్ కడుపులో మాస్కు కనిపించింది. యూకేలో ఓ నక్క మూతికి మాస్కు చిక్కుకుంది. ఇలా ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కరోనా వచ్చాక ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లోవ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత అది చెత్తలా మారింది. వినియోగం తర్వాత మనుషులు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ప్లాస్టిక్ తో చేసినవి కావడంతో భూమి, నీరు, గాలి కలుషితం అవుతోంది. మూగజీవాలు, వన్య ప్రాణులు, జలచరాల పాలిటి మృత్యువులా మారాయి. ఇదంతా చెత్తలా మారి నదులు, సముద్రాల్లో కలుస్తోంది. దీంతో జలచరాలకు ప్రాణగండం పొంచి ఉంది. ఆహారంగా భావించి వాటిని తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. కోతులు, కుక్కలు కూడా మాస్కులు తింటున్నాయి. కడుపులోకి ప్లాస్టిక్ వెళ్లడంతో జంతువులు బలహీనంగా మారతాయి. ఆ తర్వాత చనిపోతాయి. ఇది వన్యప్రాణుల సంరక్షకులను, జంతు ప్రేమికులను ఎంతగానో బాధిస్తోంది.

రీయూజబుల్ మాస్కులే వాడండి, ముక్కులుగా చేయండి:
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు మూగజీవాల సంరక్షణకు చర్యలు చేపట్టారు. అంతేకాదు ప్రజలకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. వాడేసిన మాస్కులు, గ్లోవ్స్ ను పడేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ తో తయారు చేసిన మాస్కుల బదులు గుడ్డతో చేసిన రీయూజబుల్ మాస్కులే వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు, వాడేసిన గ్లోవ్స్ లేదా మాస్కులు..పడేసే ముందు..వాటిని ముక్కలుగా చేయాలని చెప్పారు. ఆ విధంగా జంతువులను వాటి బారి నుంచి కాపాడిన వారవుతారని తెలిపారు.

మాస్కులు, పీపీఈ కిట్ల వ్యర్థాలతో నిండిన నదులు, సముద్రాలు:
2019 సెప్టెంబర్ లో యూకేలో బీచ్-క్లీనింగ్ వాలంటీర్లు సర్వే చేసిన సమయంలో.. దాదాపు మూడవ వంతు బీచ్ లలో పీపీఈ వస్తువులు కనుగొనబడ్డాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కరోనావైరస్ మహమ్మారితో బాధపడుతున్న విషయం వాస్తవమే. కానీ ప్లాస్టిక్ కారణంగా ప్రకృతి అనారోగ్యానికి గురవుతుందన్న విషయాన్ని, మూగజీవాలు మృత్యువాత పడుతున్న నిజాన్ని మర్చిపోకూడదని పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు అంటున్నారు. ఇప్పటికైనా మనుషుల్లో మార్పు రావాలని, ఎక్కడ పడితే అక్కడ మాస్కులు, పీపీఈ కిట్ల వ్యర్థాలు పడేయకుండా జాగ్రత్తపడాలని ఆశిద్దాం. లేదంటే భారీ మూల్యం తప్పదు. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. అలాగే తన చుట్టూ ఉన్న జంతు, జీవుల ప్రాణాలను కాపాడటం కూడా అంతే ప్రధానం.