బ్రేకింగ్ : కరోనా వైరస్ సోకి భారతీయుడు మృతి

  • Edited By: chvmurthy , January 30, 2020 / 09:52 AM IST
బ్రేకింగ్ : కరోనా వైరస్ సోకి భారతీయుడు మృతి

చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 
 

త్రిపురలోని పురాతల్ రాజ్ నగర్ కు చెందిన మనీర్ హుస్సేన్(26) 2018లో ఉద్యోగం కోసం మలేషియా వెళ్లాడు. అక్కడే ఒక రెస్టారెంట్ లో చేరాడు. అయితే ఇటీవల కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరి మరణించినట్లు అతడి తాత అబ్దుల్ రహీమ్ మీడియాకు తెలిపారు. బుధవారం ఉదయం మలేషియా అధికారుల నుంచి ఫోన్ వచ్చినట్లు రహీమ్ వివరించారు.
Also Read : మాస్క్ లేకపోతే కుదరదన్న సన్నీలియోన్ : కరోనా వైరస్ ఎఫెక్ట్

అయితే భారత అధికారులు దీన్ని ధృవీకరించాల్సి ఉంది. అధికారులు.. మలేషియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక వేళ ధృవీకరిస్తే కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన తొలి భారతీయ వ్యక్తి హుస్సేన్ అవుతారు. కరోనా వైరస్ బారిన పడి చైనాలో గురువారం నాటికి (జనవరి 30, 2020) 170 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6వేల మంది కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

గురువారం(జనవరి 30,2020) టిబెట్ లో తొలి కరోనా కేసు నమోదైంది. వ్యాధి సోకిన వ్యక్తి చైనాలోని హువాయ్ ఫ్రావిన్స్ నుంచి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు భారత్ లోకి కూడా కరోనా వైరస్ ప్రవేశించింది. కేరళ రాష్ట్రంలో తొలి coronavirus కేసు నమోదైంది. చైనా నుంచి భారత్ కు తిరిగొచ్చిన కేరళకు చెందిన విద్యార్ధికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.

Also Read : కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారా ?