America లో విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 10:01 AM IST
America లో విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. దీంతో ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. Online Class లకు హాజరయ్యే విదేశ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్ నిర్ణయంపై ఆగ్రహాలు వ్యక్తమయ్యయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు.

ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ…అక్కడ వివిధ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 200కి పైగానే విద్యా సంస్థలు వీటిపై సంతకాలు కూడా
చేశాయి. Harward, MIT విశ్వ విద్యాలయాలు కోర్టు తలుపులు తట్టాయి. వీటికి దిగ్గజ సంస్థలైన Google, Facebook, Microsoft సంస్థలు మద్దతు పలికాయి.

కరోనా వైరస్ ప్రబలుతుండడంతో స్కూళ్లు, విశ్వ విద్యాలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి. అమెరికాలో ఇదే విధంగా కొనసాగుతోంది. అయితే…ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు అమెరికా విడిచివెళ్లాలని ట్రంప్ జులై 06వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే…విశ్వ విద్యాలయం ప్రాంగణంలోనే విద్యాబోధన అందించే వర్సిటీలకు మారాలని ప్రభుత్వం సూచించింది. దీంతో వివిధ కోర్సులు అందించే విద్యా సంస్థలకు మారడమా ? లేక స్వదేశాలకు వెళ్లడమా అనేది విద్యార్థులు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆన్ లైన్ తరగతులపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తూ…మార్చి 13వ తేదీన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ICE) తీసుకున్న నిర్ణయానికి..ట్రంప్ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని కోర్టులో వాదించాయి. ఏదైమైనా ఈ నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గడంతో విద్యార్థులకు ఊరట కలిగినట్లైంది.