Donald Trump : ఆ ముస్లిం దేశాలపై “ట్రావెల్ బ్యాన్” పునరుద్దరించండి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచనలు చేశారు.

Donald Trump : ఆ ముస్లిం దేశాలపై “ట్రావెల్ బ్యాన్” పునరుద్దరించండి

Donald Trump

Donald Trump అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచనలు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా ఉండాలంటే పలు ముస్లిం దేశాలపై తన హయాంలో విధించిన ప్రయాణ నిషేధాన్ని పునరుద్దరించాలని,అలాగే, శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంపైనా తన హయాంలో తీసుకువచ్చిన ఆంక్షల్ని అమలులోకి తేవాలని సోమవారం ఓ ప్రకటనలో ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అమెరికా నుంచి నిర్మూలించడానికి మనం కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.. కొన్ని నిబంధనల్ని అమలులోకి తేవాలి.. ఐరోపా చేసిన ఇమ్మిగ్రేషన్‌ తప్పిదాలను మనం తిరిగి చేయకూడదు అని ట్రంప్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలైన ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌ దేశాల ప్రయాణికులు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ట్రావెల్ బ్యాన్ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్‌‌నకు అప్పట్లో న్యాయస్థానాలు మొట్టికాయలు వేశాయి. అయితే, గతేడాది చివర్లో జో బైడెన్‌ అధికారంలోకి వచ్చాక ట్రంప్ జారీచేసిన ప్రయాణ నిషేధ ఆదేశాలను రద్దుచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.