మోడీ గ్రేట్,చాలా మంచోడు…స్వరం మార్చిన ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 09:04 AM IST
మోడీ గ్రేట్,చాలా మంచోడు…స్వరం మార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప్రధాని మోడీపై పొడగ్తల వర్షం కురిపించారు.

భారత ప్రధాని మోడీ సహాయం చేసేవాడని,మోడీ చాలా గ్రేట్ అని ట్రంప్ అన్నారు. మోడీ చాలా మంచి వాడని ట్రంప్ అన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ విషయంలో భారతదేశం యొక్క పొజిషన్ కు మద్దుతుగా నిలిచారు ట్రంప్.

ఫాక్స్ న్యూస్ తో ఇవాళ ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…నేను 29మిలియన్లకు పైగా  డోస్ లను కొనుగోలు చేశాను. భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడాను. గుజరాత్ లోని మూడు ఫ్యాక్టరీల నుంచి మొదటి విడతతో మొత్తం 29మిలియన్ డోస్ ల హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ అమెరికాకు వస్తుంది. మీరు వాటిని రిలీజ్ చేస్తారా అని నేను మోడీని అడిగాను? మోడీ చాలా గ్రేట్. మోడీ చాలా మంచివాడు. భారత్ కు ఆ ట్యాబ్లెట్లు కావాలి కనుకనే వాళ్లు వాటి ఎగుమతులు నిలిపివేశారని మీకు తెలుసా. భారత్ నుంచి చాలా మంచి విషయాలు రాబోతున్నాయి అని ట్రంప్ అన్నారు.(Vertical Transmission… తల్లి గర్భంలోని పిండానికి కూడా కరోనా వ్యాపిస్తుందా?)

మంగళవారం వైట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..యాంటీ మలేరియా డ్రగ్ అమెరికాకు ఎగుమతి చేయకూడదు అని భారత ప్రధాని మోడీ నిర్ణయంగా ఉంటే నేను ఆశ్చర్యపోతాను. ఆయన నాకు ఫోన్ లోనే ఆ విషయం చెప్పి ఉండాల్సింది. ఆదివారం ఉదయం మోడీతో ఫోన్ లో మాట్లాడాను. అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి విసయమై ఆయనతో మాట్లాడాను. ఒకవేళ ఆయన అమెరికాకు ఆ ట్యాబ్లెట్లు ఎగుమతి చేయకుంటే సరే. కానీ నిస్సందేహంగా ప్రతీకారం మాత్రం ఉంటుంది.

చాలా ఏళ్లుగా వ్యాపార విషయాల్లో అమెరికా వల్ల భారత్ బాగా లబ్ధి పొందుతుంది. కాబట్టి ఎందుకు ప్రతీకారం ఉంటకూడదు? అని ట్రంప్ అన్న వ్యాఖ్యలు కలకలం రేసిన విషయం తెలిసిందే. కాగా,ఇప్పుడు అమెరికా సహా పలు దేశాలకు అవసరమైన మందులు పంపిస్తామని భారత్ ప్రకటించడంతో ట్రంప్ మళ్లీ తన స్వరం మార్చారు.

ప్రపంచంలోని హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాలో 70 శాతం (200 మి.గ్రా చొప్పున సుమారు 20 కోట్ల మాత్రలు) భారతదేశం ఒక్కటే తయారు చేస్తుంది. కరోనా వైరస్(COVID-19) కేసులకు సాధ్యమైన చికిత్సగా యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మెడిసిన్ ను గుర్తించింది. చైనా,దక్షిణ కొరియా ఇలా ప్రపంచంలోని చాలా దేశాలకు కరోనా వైరస్ ట్రీట్మెంట్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగిస్తున్నాయి.భారత్ కూడా కరోనా ట్రీట్మెంట్ లో ఈ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తుంది. అయితే మార్చి-25న భారత్…ఇతర దేశాలకు ఈ ట్యాబ్లెట్ల సప్లయ్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే.

అయితే మానవత్వం దృష్ట్యా ఈ ట్యాబ్లెట్లను అవసరమైన దేశాలకు ఎగుమతి చేస్తామని మంగళవారం భారత్ ప్రకటించింది. అయితే భారతదేశంలోని ప్రజల అవసరాలకు తగినన్ని మందులు ఉన్న తర్వాతనే ఇతర దేశాలకు సరఫరా చేయాలని మోడీ సర్కార్ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ట్రంప్ ప్రతీకార వ్యాఖ్యలనుద్దేశించి స్నేహం..ప్రతీకారం గురించి కాదని రాహుల్ అన్నారు. ఇండియా అన్ని దేశాలకు సహాయం తప్పనిసరిగా సహాయం చేయాలి. కానీ మొదట మనకు ఆ మెడిసిన్స్ పూర్తిగా అందుబాటులో ఉండాలని రాహల్ గాంధీ అన్నారు.