ట్రంపా మజాకా : బంగారు గ్లాసులో నీళ్లు..వెండి పాత్రలో భోజనం

  • Published By: madhu ,Published On : February 22, 2020 / 12:47 PM IST
ట్రంపా మజాకా : బంగారు గ్లాసులో నీళ్లు..వెండి పాత్రలో భోజనం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో రెండు రోజుల్లో భారతదేశానికి రాబోతున్నారు. ఈ విశిష్ట అతిథికి..ఘన స్వాగతం పలికేందుకు మోడీ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ట్రంప్ పర్యటనపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆయన పర్యటనకు సంబంధించి విశేషాలు తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఆయనకు సంబంధించి ఓ విశేషం బయటకు వచ్చింది. 

వెండి పాత్రలో భోజనం….బంగారు గ్లాసులో నీళ్లు….అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతుల విందు కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ట్రంప్ కోసం వెరైటీ వంటకాలే కాదు….విందారగించే ప్లేట్లు కూడా ప్రత్యేకమే. బంగారం, వెండి, రాగి తదితర మెటల్స్‌తో పాత్రలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూపొందించారు. బంగారం, వెండి కోట్‌తో వివిధ రకాల గ్లాసులు, గిన్నెలు, ప్లేట్లు జిగేల్‌ మంటున్నాయి.

ఇవి కేవలం అమెరికా అధ్యక్షుడి డిన్నర్‌ కోసమే తయారు చేశారు. ఆరుగురు అతిథుల కోసం ప్రత్యేక డిజైన్లతో రూపొందిన ఈ పాత్రలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read More : ట్రంప్ టూర్ కేజ్రీకి అందని ఆహ్వానం : ఎవరిని పిలవాలో అమెరికా నిర్ణయిస్తుంది. 

మరోవైపు…అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోసం కాన్పూర్‌లో ప్రత్యేకంగా స్వీట్లు తయారవుతున్నాయి. ఈ స్వీట్లను బీజేపీ కార్యకర్తలు ట్రంప్‌కు గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. ట్రంప్‌, మోదీ కలిసి ఉన్న ఫొటోలతో ఉన్న డబ్బాలలో స్వీట్లను ప్యాక్‌ చేస్తున్నారు. అహ్మదాబాద్, ఆగ్రాకు వెళ్లి ట్రంప్‌కు స్వీట్లను అందించనున్నారు. కాజు కట్లి, బూందీ లడ్డూ, రాజ్‌ భోగ్, రస్ మలై తదితర స్వీట్లను తయారు చేస్తున్నారు.