భారతీయులకు ట్రంప్ షాక్.. H1-B వీసాల రద్దు?

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 02:22 PM IST
భారతీయులకు ట్రంప్ షాక్.. H1-B వీసాల రద్దు?

కరోనావైరస్ మహమ్మారితో అగ్రరాజ్యమైన అమెరికాలో భారీ నిరుద్యోగం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటి నిపుణులలో ఎక్కువగా అభ్యర్థించే H -1Bతో సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. అనేక కొత్త వీసాలు జారీ చేసిన తరుణంలో ప్రతిపాదిత సస్పెన్షన్ అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ కొత్త ఆర్థిక సంవత్సరంలో విస్తరించే అవకాశం కనిపిస్తోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది.

‘ఈ ప్రతిపాదిత సస్పెన్షన్.. దేశానికి వెలుపల ఉన్న కొత్త H-1B వీసాదారులను సస్పెన్షన్ ఎత్తివేసే వరకు పని చేయకుండా నిరోధించగలదు. ఇప్పటికే దేశంలో వీసా ఉన్నవారిపై ప్రభావితం అవకాశం లేదని న్యూస్ పేపర్ నివేదించింది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ నిపుణులకు H-1B అత్యంత ఇష్టపడే విదేశీ వర్క్ వీసాలుగా పేరొంది. 

ట్రంప్ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటి నిపుణులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హెచ్ -1బి వీసాలలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. కరోనావైరస్ సమయంలో వారంతా తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే తుది నిర్ణయం తీసుకోలేదని, పరిపాలన వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తోందని వైట్ హౌస్ పేర్కొంది. 

ప్రస్తుతం అమెరికన్ నిపుణులు, ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారు ముఖ్యంగా వెనుకబడిన తక్కువ వయస్సు గల పౌరులను రక్షించడానికి కెరీర్ నిపుణులచే రూపొందించిన అనేక రకాల ఎంపికలను అంచనా వేస్తోంది. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వైట్ హౌస్ ప్రతినిధి Hogan Gidley ఒక ప్రకటనలో తెలిపారు. H-1B వీసాలతో పాటు, స్వల్పకాలిక కాలానుగుణ వర్కర్లకు H-2B వీసా, క్యాంప్ కౌన్సెలర్లు సహా స్వల్పకాలిక కార్మికులకు J-1 వీసా, అంతర్గత  L-1 వీసాకు సస్పెన్షన్ వర్తించవచ్చునని నివేదించింది.

యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సీఈఓ Thomas Donohue గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాశారు. తాత్కాలిక పని వీసాలపై ఆయన నివేదించిన చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు.. అమెరికన్ వ్యాపారాలకు తమ శ్రామిక శక్తి అవసరాలను తీర్చగలరని హామీ ఇవ్వాలని అన్నారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి ప్రతిభకు తగినట్టుగా యాక్సస్ చాలా ముఖ్యమని డోనోహూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

The Hill News Paper ప్రకారం.. అమెరికన్ వ్యాపారాలకు అవసరమైన నైపుణ్యం కోసం తక్కువ సమయంలో చెల్లుబాటు అయ్యే వర్క్ వీసా ఉన్న L -1 వీసా హోల్డర్లు అవసరమని డోనోహ్యూ చెప్పారు. టెక్నాలజీ, అకౌంటింగ్, తయారీదారులతో సహా వివిధ పరిశ్రమలకు పలు సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే వర్క్ వీసా ఉన్న హెచ్ -1B వీసా హోల్డర్ల ప్రాముఖ్యతను గుర్తించారు.