కట్టుడు కట్టుడే : స్టీల్ గోడ కట్టేస్తా అంటున్న ట్రంప్

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 04:59 AM IST
కట్టుడు కట్టుడే : స్టీల్ గోడ కట్టేస్తా అంటున్న ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు మెక్సికో సరిహద్దు వెంట కట్టే గోడ విషయంలో మొండిపట్టు పడుతున్నారు. అక్రమ వలసదారులను అడ్డుకొనేందుకు గోడ కట్టేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి ట్రంప్ 560 కోట్ల డాలర్లు కోరుతుంటే…దీనిని ప్రతిపక్ష డెమోక్రాట్లు ఇయ్యమంటున్నారు. ఇంకేముంది….అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయిపోయింది. ఈ విషయంపై ట్రంప్ పునరాలోచనలో పడిపోయారు. కాంక్రీట్ వద్దని…స్టీల్‌తో నిర్మాణం చేపట్టాలని కొత్త ప్లాన్ చెప్పారు. ఈ విషయంపై తాను అమెరికా ఉక్కు పరిశ్రమ సంఘం అధ్యక్షుడు..ఇతరులతో సమావేశమౌతానంటూ ట్రంప్ చెప్పారు. 
ఈ గోడ కడితే అక్రమ వలసలు…మాదక ద్రవ్యాల సరఫరా అడ్డుకోవచ్చు…దీనిద్వారా నేరాలు తగ్గుముఖం పడుతాయంటూ ట్రంప్ వెల్లడిస్తున్నారు. గోడ నిర్మాణంపై ఆయన పలు భేటీలు నిర్వహించే అవకాశం ఉంది.