ట్రంప్ కు ట్విట్టర్ వార్నింగ్…అధ్యక్షుడుకి ఆగ్రహం

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 05:22 AM IST
ట్రంప్ కు ట్విట్టర్ వార్నింగ్…అధ్యక్షుడుకి ఆగ్రహం

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు మైక్రోబ్లాగింగ్‌, సోష‌ల్ నెట్విర్కింగ్ స‌ర్వీస్‌ “ట్విట్ట‌ర్ సంస్థ” వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం(మే-26,2020)ట్రంప్ చేసిన రెండు ట్వీట్లు “ఆధారాలు లేనివి” అని మరియు ట్రంప్ తప్పుడు వాదనలు చేస్తున్నట్లు ఆరోపించిన ట్విట్టర్ సంస్థ ఆయనకు మొదటిసారి ‘ఫ్యాక్ట్‌ చెక్’‌ వార్నింగ్ ఇచ్చింది. 

ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ల‌తో ఎన్నికల్లో ఫ్రాడ్ జ‌రుగుతుంద‌ని మంగళవారం ట్రంప్ రెండు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్ ల పై ట్విట్టర్ అభ్యంతరాలు లేవనెత్తింది. ఇటీవల, ట్విట్టర్ సంస్థ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఎవ‌రైనా అసత్య స‌మాచారం పోస్టు చేస్తే అటువంటి వారికి వార్నింగ్ ఇచ్చే విధంగా ట్విట్ట‌ర్ కొత్త విధానాన్ని తీసుకువ‌చ్చింది. దీని ప్రకారం మంగళవారం ట్రంప్ చేసిన రెండు ట్వీట్ లకు ట్విట్టర్‌… వార్నింగ్ లేబుల్ ఇచ్చింది.

ట్రంప్ చేసిన ట్వీట్ల కింద బ్లూమార్క్ వార్నింగ్‌ ను గుర్తించవచ్చు. నిజాలు తెలుసుకుని ట్వీట్లు చేయాలని ఆ హెచ్చ‌రిక‌ల్లో ట్విట్టర్ తెలిపింది. నిన్న మొన్నటివరకు సాధారణ ట్విట్టర్ యూసర్ లకు మాత్రమే వార్నింగ్ ఇచ్చిన ట్విట్టర్…ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా వార్నింగ్ ఇచ్చింది. 

ట్విట్టర్ హెచ్చరించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డ‌మేనని,అధ్యక్షుడిగా తాను అది జరగనివ్వనని అంటూ ట్విట్ట‌ర్ సంస్థ‌పై ట్రంప్ ఫైర్ అయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ సంస్థ జోక్యం చేసుకుంటుందంటూ ఆరోపిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.

2_1.JPG1_1.JPG