అమెరికా చరిత్రలో అధ్యక్షుడి రెండో అభిశంసన సాధ్యమేనా? ట్రంప్‌ను సాగనంపే ప్రక్రియ ఎలా ఉండనుంది?

అమెరికా చరిత్రలో అధ్యక్షుడి రెండో అభిశంసన సాధ్యమేనా? ట్రంప్‌ను సాగనంపే ప్రక్రియ ఎలా ఉండనుంది?

Donald Trump impeachment : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు దారితీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. యూఎస్ కాంగ్రెస్ డెమొక్రాట్లు ట్రంప్‌పై రెండో అభిశంసన ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారంట. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ట్రంప్ పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓటింగ్ మోసం అంటూ తప్పుడు ఆరోపణలతో విరుచుకుపడిన ట్రంప్.. తన మద్దతుదారులతో యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించినందుకు ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఉద్రికత్త పరిస్థితులకు ట్రంపే కారణమంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ రెండో అభిశంసన ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశమైంది.

అభిశంసన అంటే ఏంటి?
అభిశంసన.. అంటే అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడమనే అపోహ ఉంది. వాస్తవానికి అభిశంసన అనేది.. కాంగ్రెస్ దిగువ సభలో ప్రతినిధుల సభను మాత్రమే సూచిస్తుంది. ఒక అధ్యక్షుడు నేరం లేదా ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు దీన్ని ప్రవేశపెడతారు. ఒక క్రిమినల్ కేసులో నేరారోపణకు సమానంగా చెప్పవచ్చు. సభలో 435 మంది సభ్యులలో సాధారణ మెజారిటీ ఆరోపణలను ఆమోదిస్తే సెనేట్ ఎదుట విచారణ ఉంటుంది. ఒక అధ్యక్షుడిని దోషిగా తేల్చి తొలగించడానికి రాజ్యాంగంలో సెనేట్ మూడింట రెండు వంతుల ఓటు అవసరం ఉంటుంది.

భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయానికి ట్రంప్‌ అనర్హులేనా?
అంటే అవుననే చెప్పాలి. అభిశంసన.. రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. భవిష్యత్ పదవిలో ట్రంప్‌ను అనర్హులుగా ప్రకటించడానికి సెనేట్‌లో సాధారణ మెజారిటీ మాత్రమే అవసరం ఉంటుంది. 2024లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిరోధించే వాస్తవిక అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెనేట్ ముందు అనర్హతపై ఓటు వేయడం, దోషిగా తేల్చాలా? పదవి నుంచి తొలగించాలా అనే దానిపై ఓటు వేసిన తరువాత మాత్రమే నిర్ణయిస్తారు. భవిష్యత్తులోనూ ట్రంప్ పై అనర్హతపై మాత్రమే ఓటు వేసే అధికారం సెనేట్‌కు ఉంటుందని న్యాయ ప్రొఫెసర్ పాల్ కాంపోస్ అంటున్నారు.

పదవీవిరమణ తర్వాత కూడా అభిశంసన వర్తిస్తుందా? :
పదవీ విరమణ తర్వాత కూడా అభిశంసన వర్తిస్తుందనడానికి ఏ న్యాయస్థానం ఇంకా ఖచ్చితంగా తీర్పు ఇవ్వలేదు. అయితే చాలా మంది స్కాలర్లు.. ట్రంప్ పదవిని వీడటం ద్వారా అభిశంసన చర్యను కొనసాగించలేరని అంటున్నారు. ఎందుకంటే భవిష్యత్ లో ప్రభుత్వ కార్యాలయం నుంచి ఆయనపై అనర్హత వేటు విధించవచ్చు.
Trump is heading for second impeachmentఅమెరికా అధ్యక్షుడిగా ఎప్పుడైనా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారా?
అంటే.. లేదనే చెప్పాలి. కానీ, న్యాయ నిపుణులు మాత్రం కాంగ్రెస్ అలా చేయడం రాజ్యాంగబద్ధమైనదిగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి ఉక్రెయిన్‌తో వ్యవహరం నడపడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై ట్రంప్‌ను 2019 డిసెంబర్‌లో డెమొక్రాటిక్ నేతృత్వంలోని సభ అభిశంసించింది. కానీ, ట్రంప్‌ను ఫిబ్రవరి 2020లో రిపబ్లికన్ నేతృత్వంలోని సెనేట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

త్వరగా అభిశంసనతో పదవి నుంచి తొలగించవచ్చా?
ట్రంప్‌ను అభిశంసన చేసి తొందరగా కొద్ది రోజుల్లోనే అధ్యక్ష పదవి నుంచి తొలగించవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. అది కూడా సిద్ధాంతపరంగా సాధ్యమేనంటున్నారు. ఎందుకంటే రెండు సభలలోని నియమాలను మార్చి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ, ప్రస్తుత నిబంధనలను పున:పరిశీలిస్తే.. ఈ ప్రక్రియను వారంలోపు పూర్తి చేయడం కష్టమవుతుందని అంటున్నారు. వేగంగా చేయడానికి కూడా వీలుందని చెబుతున్నారు.

ట్రంప్‌పై నేరం.. దుశ్చర్య ఆరోపణలు చేయొచ్చా?
2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌‌ను తిప్పికొట్టేందుకు ట్రంప్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించారంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. గత వారం జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌ పెర్జర్‌తో ట్రంప్ గంటసేపు ఫోన్ కాల్‌ మాట్లాడినట్టు కూడా ఈ కథనాల్లో వినిపించాయి. బైడెన్ విజయాన్నిఅడ్డుకోవడానికి ట్రంప్ ప్రయత్నించినట్టు కథనాల్లోని సారాంశంగా కనిపిస్తోంది.