ఆ బిల్లుపై సంతకం చేయనన్న ట్రంప్.. లక్షలాది అమెరికన్ల ఆశలకు గండి!

ఆ బిల్లుపై సంతకం చేయనన్న ట్రంప్.. లక్షలాది అమెరికన్ల ఆశలకు గండి!

Trump refuses aid bill to jobless benefits for millions : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరి మాట వినరు. ట్రంప్ రూటే సపరేటు.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినా ఆయన తన పంతాను మాత్రం మార్చుకోవడం లేదు. అదే వైఖరిని ట్రంప్ అవలంభిస్తున్నారు. కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న అమెరికవాసులను ఆదుకోవాల్సిన కరోనా సహాయ బిల్లుకు గండి కొట్టారు ట్రంప్. కరోనా సహాయ నిధి కోసం ట్రంప్ ప్రభుత్వం 2.3 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని విడుదల చేయాలని నిర్ణయించింది. కానీ, ఈ బిల్లుపై సంతకం చేసేందుకు ట్రంప్ తిరస్కరించారు. దాంతో మిలియన్ల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి ఎదురైంది. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది అమెరికా నిరుద్యోగులు.. నిరుద్యోగ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కోవిడ్‌-19 సహాయ బిల్లు, ప్రత్యేక నిరుద్యోగ భృతికి 892 బిలియన్ల డాలర్లు, ప్రభుత్వ వ్యయానికి మరో 1.4 లక్షల కోట్ల డాలర్ల బిల్లుపై గడువు డిసెంబర్ 26వ తేదీతో ముగిసిపోయింది.

ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేయకపోతే.. దాదాపు 1.4 కోట్ల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోల్పోనున్నారని అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ డేటా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ నిధుల బిల్లును కాంగ్రెస్ అంగీకరించకపోతే.. పాక్షిక ప్రభుత్వ షట్ డౌన్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. రిపబ్లికన్లు డెమొక్రాట్లు మధ్య నెలకొన్న కొన్ని నెలల వివాదం తరువాత.. వారాంతంలో, వైట్ హౌస్ మద్దతుతో ప్యాకేజీకి అంగీకరించారు. ఈ బిల్లుపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడం చాలా మంది వైట్ హౌస్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆర్థిక సాయం సరిపోదని ఓవైపు అమెరికాలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ వైఖరిపై రిపబ్లికన్లు డెమొక్రాట్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆర్థికవేత్తలు బిల్లు సహాయం చాలా తక్కువగా ఉందని అంగీకరిస్తున్నారు. ట్రంప్ సంతకం చేయడానికి నిరాకరించడంపై బైడెన్ వర్గం తీవ్రంగా మందలించింది. రిపబ్లికన్ అధ్యక్షుడిపై వెంటనే చర్య తీసుకోవాలని బైడెన్ పిలుపునిచ్చారు. అమెరికాలో మహమ్మారితో దాదాపు 330,000 మంది మరణించారు. రోజువారీ మరణాల సంఖ్య 3,000 మందికి పైనే నమోదవుతున్నాయి.