Former US President Donald Trump: ప్లోరిడాలోని త‌న నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు చేస్తుంద‌న్న ట్రంప్.. ఎఫ్‌బీఐ అధికారులు మాత్రం..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బిఐ సోదాలు నిర్వహిస్తోందని మంగ‌ళ‌వారం త‌న ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు.

Former US President Donald Trump: ప్లోరిడాలోని త‌న నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు చేస్తుంద‌న్న ట్రంప్.. ఎఫ్‌బీఐ అధికారులు మాత్రం..

Trump

Former US President Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బిఐ సోదాలు నిర్వహిస్తోందని మంగ‌ళ‌వారం త‌న ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. అయితే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) నుండి అధికారిక ధృవీకరణ రాలేదు. ట్రంప్ తన వైట్ హౌస్ పదవీకాలం నుండి త‌ప్పుక‌నే స‌మ‌యంలో క్లాసిఫైడ్ అధ్యక్ష రికార్డులను తన ఫ్లోరిడా నివాసానికి తీసుకెళ్లారా అనే దానిపై దర్యాప్తుకు సంబంధించిన చ‌ర్య‌ల్లో భాగంగా ఈ సోదాలు నిర్వ‌హిస్త‌న్న‌ట్లు తెలుస్తోంది.

Donald Trump: ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు హాజరైన డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ

ఈ విష‌యంపై ట్రంప్ త‌న ఫేస్ బుక్ ఖాతా ద్వారా వివ‌రించారు.. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని నా అందమైన ఇల్లు మార్-ఎ-లాగో ప్రస్తుతం ముట్టడిలో ఉంద‌న్నారు. భారీ సంఖ్య‌లో ఎఫ్‌బిఐ ఏజెంట్లచే ఆక్రమించబడినందున ఇవి మన దేశానికి చీకటి సమయాలు అంటూ ట్రంప్ పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. తాను ప్రభుత్వ సంస్థ అయిన ఎఫ్‌బిఐకు స‌హ‌క‌రిస్తున్నాన‌ని, కానీ తన పామ్ బీచ్ నివాసంలో అక‌స్మాతుగా సోదాలు చేయ‌డం సరికాదని ట్రంప్ నొక్కి చెప్పాడు. దీనిని ప్రాసిక్యూటోరియల్ దుష్ప్రవర్తన అని పిలుస్తారంటూ ట్రంప్ పేర్కొన్నారు. 2024లో అధ్యక్ష పదవికి నేను పోటీ చేయకూడదనుకునే ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ట్రంప్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అక్ర‌మంగా ఎఫ్‌బీఐ అధికారులు త‌న నివాసంలోకి చొర‌బ‌డ్డార‌ని ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

Trump Wife Ivana Death : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి

ఇదిలాఉంటే ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేస్తున్న స‌మ‌యంలో ట్రంప్ ఎస్టేట్‌లో లేరని, ఆ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఎఫ్‌బీఐ సెర్చ్ వారెంట్‌ని అమలు చేసిందని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ నివేదించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తిరిగి పొందిన ఫ్లోరిడా ఎస్టేట్‌కు సంబంధించిన క్లాసిఫైడ్ రికార్డులను ట్రంప్ తొలగించడంపై US న్యాయ శాఖ దర్యాప్తు చేస్తోంది. కొన్ని రికార్డులను నేషనల్ ఆర్కైవ్స్‌కు తిరిగి ఇవ్వడానికి అంగీకరించినట్లు ట్రంప్ గతంలో ధృవీకరించారు, దీనిని సాధారణ ప్రక్రియగా పేర్కొన్నారు. ట్రంప్ అనేక చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో చాలా వరకు అతని వైట్ హౌస్ పదవీకాలం నుండి మిస్సింగ్ నేషనల్ రికార్డులు, US క్యాపిటల్‌పై దాడి, వైర్ ఫ్రాడ్, జార్జియా ఎన్నికల ట్యాంపరింగ్‌తో సహా అనే కేసుల్లో విచార‌ణ‌ను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.