Trump Impeached : రెండుసార్లు అభిశంసన.. నన్ను ఏమాత్రం మార్చలేదు.. నేనింకా అధ్వాన్నంగా మారా : ట్రంప్!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన నాలుగు ఏళ్ల పాలనలో రెండుసార్లు ప్రతినిధుల సభ అభిశంసించింది. ఆ తరువాత తాను మరింత అధ్వాన్నంగా మారినట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు.

Trump Impeached : రెండుసార్లు అభిశంసన.. నన్ను ఏమాత్రం మార్చలేదు.. నేనింకా అధ్వాన్నంగా మారా : ట్రంప్!

Trump Says Being Impeached Twice Didn't Change Him

Trump impeached twice : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన నాలుగు ఏళ్ల పాలనలో ప్రతినిధుల సభ రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. అభిశంసన తనను ఏమాత్రం మార్చలేదని.. కానీ, తాను మరింత అధ్వాన్నంగా మారినట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆదివారం (జూలై 11)న వార్షిక కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్.. తనపై అభిశంసన ఆరోపణలను మాజీ అటార్నీ జనరల్ విలియం బార్ అభిశంసనతో పోల్చి చెప్పారు. ట్రంప్‌ రాజకీయ లబ్ధి కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ అక్టోబరులో ప్రతినిధుల సభలో ఆయనపై అభిశంసన చర్యలకు పిలుపునిచ్చాయి.

హౌస్ జ్యుడిషియరీ కమిటీలోని ప్రతినిధి స్టీవ్ కోహెన్ (D-Tenn) బార్‌ను గత జూన్‌లో అభిశంసించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ చట్ట నియమాలను పాటించడం లేదని ఆరోపించారు. అభిశంసన ఆరోపణలపై ట్రంప్ డల్లాస్ లో రిపబ్లికన్ మద్దతుదారుల సమావేశంలో ప్రసంగించారు. అభిశంసన తర్వాతే తాను ఒక విభిన్నవ్యక్తిగా అయ్యానని అన్నారు. అంతేకానీ, మాజీ అధ్యక్షుడు భిన్నంగా మారలేదని స్పష్టం చేశారు. డెమాక్రాట్లు తనను అభిశంసన చేయాలనుకున్నారని అప్పుడు తాను వారిలో ఒకరిగా కాకుండా వేరే వ్యక్తిగా అయ్యాను అంతే.. నేను భిన్నంగా మాత్రం మారలేదని అన్నారు. నేను రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నాను. అందుకే నేనింతా అధ్వాన్నంగా మారినట్టు ట్రంప్ చెప్పారు. అంతే.. ట్రంప్ వ్యాఖ్యలతో అక్కడి మద్దతుదారుంలతా చప్పట్లు కొట్టారు.

ట్రంప్ వైట్‌హౌస్‌లో తన నాలుగేళ్ల పదవీకాలంలో రెండుసార్లు ప్రతినిధుల సభ చేత అభిశంసన (Trump Impeached) ఎదుర్కొన్నారు. మొదట 2019 డిసెంబర్‌లో తరువాత 2021 జనవరిలో ట్రంప్ పై అభిశంసన విచారణ జరిగింది. అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఉక్రెయిన్‌తో తన వ్యవహారాలకు సంబంధించి మాజీ అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సభ మొదట ట్రంప్‌ను అభిశంసించింది. తన అధ్యక్ష పదవి చివరి రోజులలో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జనవరి 6న కాపిటల్స్ పై తన మద్దతుదారులతో ట్రంప్ తిరుగుబాటును ప్రేరేపించారంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ, సెనేట్ ట్రంప్ వచ్చిన అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ నిర్దోషిగా ప్రకటించింది. ఫిబ్రవరి 2021లో రెండవసారి ట్రంప్ నిర్దోషిగా ప్రకటించింది. అభిశంసన ప్రయత్నం అనేది మన దేశ చరిత్రలో మరో గొప్ప దశ అని వ్యాఖ్యానించారు. 2024లో అధ్యక్ష పదవికి మరోసారి పోటీచేస్తారా లేదా అనేది ట్రంప్ వెల్లడించలేదు. కానీ, సభ, సెనేట్, వైట్ హౌస్ ను తిరిగి తన కంట్రోల్ లోకి తీసుకుంటానని స్పష్టం చేశారు.