వ్యాక్సిన్‌ నాకు కావాలి.. వైట్ హౌజ్ స్టాఫ్‌కు మాత్రం ఇప్పుడే కాదు: ట్రంప్

వ్యాక్సిన్‌ నాకు కావాలి.. వైట్ హౌజ్ స్టాఫ్‌కు మాత్రం ఇప్పుడే కాదు: ట్రంప్

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఆదివారం చేసిన ట్వీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు వైట్ హౌజ్ స్టాఫ్ అంతా వ్యాక్సిన్ తీసుకుంటాం. కానీ, నాకే ముందు కావాలి. వారికి ఇప్పుడే వేయించుకోవాలనే ప్రియారిటీ లేదు. సరైన సమయం చూసి COVID-19 కోసం ట్రై చేస్తాం అంటూ పోస్టు చేశారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరక్టర్ ఆంథోనీ ఫాసీ మాట్లాడుతూ.. 75శాతం నుంచి 80శాతం వరకూ అమెరికన్లకు వ్యాక్సిన్ వేయించాల్సి ఉంది. కరోనావైరస్ బారిన పడకుండా ఇమ్యూనిటీ దక్కించుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడమనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ ప్రెస్ మీటింగ్ లో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అనేది చాలా గొప్ప విషయం. మిగిలిన అన్నీ థియరీస్ కంటే గొప్ప ఫలితాలు ఇస్తుందనుకుంటున్నాం అని వెల్లడించారు.

నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ ఉల్లోట్ మాట్లాడుతూ.. ఆదివారం తాను చేసిన అనౌన్స్‌మెంట్ బట్టి సేఫ్టీ అంశాలు ప్రాధాన్యంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న మూడు శాఖల అమెరికా అఫీషియల్స్‌కు టాప్ ప్రియారిటీ ఉంటుందని చెప్పారు.

వ్యాక్సిన్‌లు అనేవి చాలా తక్కువ స్థాయిలో ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఈ మేరకు సీడీసీ అత్యవసరం ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. హెల్త్ కేర్ వర్కర్లు లాంటి వారికి ముందుగా ఇస్తారు.

కేసులు, మృతులు కలిపి అమెరికా మొత్తం కరోనా బారిన పడినవారిలో 3లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోగా.. 16.3మిలియన్ మందికి పాజిటివ్ వచ్చిందని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ చెప్తుంది.