Trump: అప్పుల్లో కూరుకుపోయి.. ఆస్తులు అమ్ముకుంటున్న ట్రంప్!

అధికారం పోయింది.. ఆస్తులు కరిగిపోయాయి.. అప్పులు మాత్రం భారంగా మారాయి.. ఎవరికో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షులు సర్ డోనాల్డ్ ట్రంప్‌కే.

Trump: అప్పుల్లో కూరుకుపోయి.. ఆస్తులు అమ్ముకుంటున్న ట్రంప్!

Trump

Trump: అధికారం పోయింది.. ఆస్తులు కరిగిపోయాయి.. అప్పులు మాత్రం భారంగా మారాయి.. ఎవరికో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షులు సర్ డోనాల్డ్ ట్రంప్‌కే. అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ట్రంప్.. ఇప్పుడు ఆస్తులు అమ్ముకుంటూ ఉన్నారు. వ్యాపారంలో లక్షల కోట్లు గడించి.. సంపదే సోపానంగా వేసుకుని అమెరికాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ట్రంప్.. అధ్యక్షుడిగా దిగిపోయాక కార్లు, ఇళ్లు అమ్మేసుకున్నారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అత్యంత విలువైన ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో పడ్డారు. వైట్‌హౌస్ నుంచి వచ్చేశాక ముందు కార్లు, విమానాలు అమ్ముకోగా.. ఇప్పుడు తన కుటుంబానికి చెందిన భారీ హోటళ్లను కూడా అమ్మేసుకుంటున్నారు. వాషింగ్టన్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ను కూడా అమ్మేందుకు ఇప్పటికే ట్రంప్ డీల్ సెట్ చేసుకున్నారు.

భవిష్యత్తులో ఈ హోటల్‌ పేరు వాల్డోర్ఫ్‌ అస్టోరియాగా మారిపోనుండగా.. దీనిని హిల్టన్‌ గ్రూప్‌ చేతుల్లోకి తీసుకోనుంది. 263 గదులున్న ఈ హోటల్.. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 60 ఏళ్ల లీజుకు తీసుకొంది. 2016లో ఈ హోటల్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. కరోనా కారణంగా భారీ నష్టాలు రావడంతో అమ్ముకోవడం తప్ప ట్రంప్‌కు మరోదారి లేకుండా పోయిందతీ చెబుతున్నారు. దాదాపు 2వేల ఏడొందల 90 కోట్లకు దీన్ని హిల్టన్ గ్రూప్‌ కొనుగోలు చేసింది.

ట్రంప్‌ మద్దతు దారులు మాత్రం ఇలాంటి ఎత్తుపల్లాలు ఆయనకు సహజమేనని, వ్యాపార రంగంలో రారాజుగా ఎదిగే క్రమంలో సింహం అప్పుడప్పుడూ ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటుందని, క్యాసినో వ్యాపారంలో గతంలో ట్రంప్ ఐదు సార్లు దివాళా తీశారని, కానీ ఆ నష్టం నుంచి కోలుకుని మళ్లీ లాభాల్లోకి వచ్చారని, ఈసారీ అదే జరుగుతుందని అంటున్నారు.