భారత్ బాటలో అమెరికా : TikTok యాప్ బ్యాన్..45 రోజుల్లో అమలు

  • Published By: madhu ,Published On : August 7, 2020 / 09:37 AM IST
భారత్ బాటలో అమెరికా : TikTok యాప్ బ్యాన్..45 రోజుల్లో అమలు

భారత్ బాటలో అమెరికా పయనిస్తోంది. TikTok., WeChat లాంటి యాప్స్ పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని, ట్రంప్ గురువారం సంతకం చేసిన వేర్వేరు ఉత్తర్వుల్లో వెల్లడించారు.



TikTok తో పాటు ఇతర చైనా యాప్స్ జాతీయ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిపోయాయని వెల్లడించారు. ఉత్తర్వులను అమలు చేయడానికి..అన్ని విభాగాలు, ఏజెన్సీలు చర్యలు తీసుకోనే విధంగా చూడాలని సూచించారు. TikTok.,  మాదిరిగానే..WeChat దాని వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో సమాచారాన్ని సేకరించి..అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ చేరవేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.



45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ చెప్పడంతో టిక్ టాక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న సంస్థలు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. జాతీయ భద్రత, రక్షణకై..అమెరికా టిక్ టాక్ యజమానులకు వ్యతిరేకంగ..కఠిన చర్యలు తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించడం విశేషం.



మరోవైపు టిక్ టాక్ కొనుగోలు చేసేందుకు మైక్రో సాఫ్ట్ ఆసక్తి చూపింది. తాము ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని ప్రకటించింది. సెప్టెంబర్ 15 నాటికి చర్చలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకుంటామని మైక్రో సాప్ట్ వెల్లడించింది. తాజాగా ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో 45 రోజుల్లోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.