ఆందోళనకారులను 10ఏళ్లు జైళ్లో పెట్టండి, ట్రంప్ టోన్ పెంచారు

  • Published By: Subhan ,Published On : June 2, 2020 / 11:41 AM IST
ఆందోళనకారులను 10ఏళ్లు జైళ్లో పెట్టండి, ట్రంప్ టోన్ పెంచారు

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. గంట పాటు సుదీర్ఘంగా గవర్నర్లతో ఫోన్‌లో సంభాషించి ఆందోళనకారులను 10ఏళ్లు జైళ్లో పెట్టారు. జార్జ్ ఫ్లాయిడ్‌ హత్య తర్వాత జాతీయ వ్యాప్తంగా పోలీసులు రెచ్చిపోతున్నారు. గవర్నర్లు ఆందోళనకారులకంటే బలహీనంగా ఉన్నారు. ఇదంతా షాకింగ్ అనిపిస్తుందని ట్రంప్ అన్నారు. 

దీనిని ట్రంప్..  ఇతర దేశాల కూడా మనల్ని గమనిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ప్రేరేపితంగా మారిపోతుంది. నవ్వుల పాలు అయ్యేలా ఉంది. ప్రత్యేకించి న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఆందోళన చేస్తున్న వారిని కనిపెట్టాలి. అరెస్టు చేయాలి. వారిని పదేళ్ల పాటు జైళ్లో పెడతామని చెప్పండి ఒక్కరు కూడా కనిపించరు’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. 

ఇదొక ఉద్యమం. దీనిని మీరు నియంత్రించలేకపోతే.. ఇంకా దారుణంగా మారుతుంది. గవర్నర్లు బలహీనమైనప్పుడు.. వారు మరింత బలంగా మారతారు. అని చెప్పినట్లు సీఎన్ఎన్ మీడియా చెప్పింది. 

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మిచిగాన్ గవర్నర్.. గ్రెచెన్ వైట్మర్ స్టేట్‌మెంట్ లో ఇలా పేర్కొన్నారు. ట్రంప్ కామెంట్లు డిస్టర్బ్ చేసేలా ఉన్నాయి. అమెరికన్లందరి మీద సానుభూతి చూపించాల్సిన సమయమిది. అడ్మినిస్ట్రేషన్ ద్వేషపూరితమైన, విడగొట్టే వైఖరి ప్రదర్శిస్తుందని వారికి తెలుసు. ఇంకా హింస, వినాశనం జరుగుతుందేమోనని భయపడుతున్నా’ అని అభిప్రాయపడ్డారు. 

Read: మిలటరీని దించుతా…ఆందోళనకారులకు ట్రంప్ హెచ్చరిక