WHOకి ట్రంప్ అల్టిమేటం…30రోజుల్లో మారకపోతే శాశ్వతంగా నిధులు ఆపేస్తా

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 07:13 AM IST
WHOకి ట్రంప్ అల్టిమేటం…30రోజుల్లో మారకపోతే శాశ్వతంగా నిధులు ఆపేస్తా

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)మరోసారి తనదైన స్టైల్ లో ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు డబ్ల్యుహెచ్ఓ పై ఆరోపణలు చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఆ సంస్థ కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 30 రోజుల్లో తన విధానాలను మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డబ్ల్యుహెచ్‌ఒను హెచ్చరించారు. ఒకవేళ 30రోజుల్లో విధానాలు మార్చుకోకపోతే తాత్కాలికంగా WHOకి నిలిపివేసిన నిధుల్ని శాశ్వతంగా ఆపేస్తామనన్నారు.

అలాగే WHOలో అమెరికా సభ్యత్వం కొనసాగించాలా వద్దా అన్నది కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. కోవిడ్-19 మహమ్మారిని కప్పిపుచ్చుతూ చైనాకు మద్దతునిస్తోందని, తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఏప్రిల్‌ మధ్యలో WHOకి  ట్రంప్ నిధులను నిలిపివేసిన విషయం తెలిసిందే. సోమవారం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కు… ‘సెల్ఫ్‌ ఎక్స్‌ప్లెనెటరీ’ పేరుతో రాసిన ఓ లేఖను ఇవాళ(మే-19,2019) ట్వీట్‌ చేశారు.

వైరస్‌ పుట్టుక గురించి ముందస్తు నివేదికలు వస్తున్నా పట్టించుకోకుండా చైనాకు మద్దతునివ్వడం WHO లోపాలకు నిదర్శనమని లేఖలో తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు అనుకూలంగా పని చేసిందని.. వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో అలసత్వం ప్రదర్శించిదని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విషయంలో మీరు, మీ సంస్థ ప్రపంచాన్ని అలర్ట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహారించింది. దీనికి ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించుకుంటుంది.

ఇలాంటి పరిస్థితి భవిష్యత్ లో ఉండకూడదంటే చైనాను వదిలేసి…స్వతంత్రంగా పనిచేయండి అంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ను ఉద్దేశించి లెటర్ లో ట్రంప్ తెలిపారు. రిఫార్మ్ కు సంబంధించి ఇప్పటికే అమెరికా అధికారులు టెడ్రోస్ తో చర్చలు ప్రారంభించారు. ఐతే టైం వేస్ట్ చేయటం తనకు ఇష్టం లేదని నెల రోజుల్లో ఆర్గనైజేషన్ లో పెద్దఎత్తున మార్పులు జరగాలని ట్రంప్ కోరారు.

కరోనా మొదలైన కొత్తలోనే చైనా నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను నిలిపివేస్తే వద్దని చెప్పినా టెడ్రోస్…చైనా లో డొమెస్టిక్ ఫ్లైట్స్ ను రద్దు చేస్తే మాత్రం కరోనా కట్టడిలో ఆ దేశం కఠినంగా వ్యవహారించిందంటూ ఎలా ప్రశంసించారని ప్రశ్నించారు. కరోనా పుట్టుక, వ్యాప్తి గురించి డబ్ల్యూహెచ్ఓ స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించటాన్ని ట్రంప్ స్వాగతించారు. వీలైనంత తర్వగా నివేదిక రావాల్సిన అవసరం ఉందన్నారు.

సోమవారం జరిగిన WHA వర్చువల్‌ మీటింగ్ లో టెడ్రోస్‌ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కరోనా పుట్టుక పై మరియు మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)స్పందనపై దర్యాప్తుకు చైనా కూడా ఆమోదం తెలిపింది.

Read: తెలుగమ్మాయిని మెచ్చుకుని,సత్కరించిన ట్రంప్