Taliban: "జంతువుల్లా తిరగాలనుకుంటున్నారా.. హిజాబ్ లేకుండా" | "Trying To Look Like Animals": Taliban On Women Without Hijab

Taliban: “జంతువుల్లా తిరగాలనుకుంటున్నారా.. హిజాబ్ లేకుండా”

తాలిబాన్లు పాలనలో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు కాందహార్ సిటీ మొత్తం పోస్టర్లు అంటించారు. ఇస్లామిక్ హిజాబ్ ధరించి శరీరం మొత్తం కవర్ కాకుండా జంతువుల్లా ఉండటానికి ప్రయత్నిస్తున్నారా అని వాటిపై పేర్కొన్నారు.

Taliban: “జంతువుల్లా తిరగాలనుకుంటున్నారా.. హిజాబ్ లేకుండా”

Taliban: తాలిబాన్లు పాలనలో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు కాందహార్ సిటీ మొత్తం పోస్టర్లు అంటించారు. ఇస్లామిక్ హిజాబ్ ధరించి శరీరం మొత్తం కవర్ కాకుండా జంతువుల్లా ఉండటానికి ప్రయత్నిస్తున్నారా అని వాటిపై పేర్కొన్నారు. ఆగష్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్ఘాన్ మహిళలపై అనేక నిబంధనలు అమలు చేశారు.

అమెరికా రక్షణలో ఉంటూ రెండు దశాబ్దాలుగా వారు గడిపిన స్వేచ్ఛను తాలిబాన్లు వెనక్కితీసుకున్నట్లు అయింది. మేలో, దేశ అత్యున్నత నాయకుడు, తాలిబాన్ చీఫ్ హిబతుల్లా అఖుంద్జాదా మహిళలు సాధారణంగా ఇంట్లోనే ఉండాలనే డిక్రీని ఆమోదించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలంటే ముఖాలతో సహా పూర్తిగా కప్పుకోవాలని ఆదేశించారు.

“హిజాబ్ ధరించకుండా ముస్లిం మహిళలు జంతువులా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారా” అని పోస్టర్లు ప్రశ్నిస్తున్నాయి. ఇవి చాలా కేఫ్‌లు, దుకాణాలపై అలాగే తాలిబాన్ కేంద్రమైన కాందహార్ అంతటా ప్రకటనల హోర్డింగ్‌లపై కనిపించాయి.

Read Also: ఇస్లాంను అవమానిస్తున్నాడని తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్ మోడల్ అరెస్ట్

పొట్టిగా, బిగుతుగా, పారదర్శకంగా ఉండే దుస్తులు ధరించడం కూడా అఖుంద్‌జాదా డిక్రీకి విరుద్ధమని పోస్టర్లు చెబుతున్నాయి.

ఈ పోస్టర్లు పెట్టినట్లు స్థానిక ఉన్నతాధికారి ధృవీకరించారు. “మేం ఈ పోస్టర్‌లను ముఖాలు కప్పుకోని (బహిరంగ ప్రదేశాలలో) వారి కుటుంబాలకు తెలియజేసేందుకే ఏర్పాటు చేశాం. ఉల్లంఘించిన వారిపై డిక్రీ ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని కాందహార్‌లోని మంత్రిత్వ శాఖ అధిపతి అబ్దుల్ రెహ్మాన్ తయేబీ మీడియాకు వెల్లడించారు.

×