COVID-19 నుంచి కాపాడటానికి టీబీ వ్యాక్సిన్

COVID-19 నుంచి కాపాడటానికి టీబీ వ్యాక్సిన్

కరోనావైరస్ తో కొద్ది నెలలుగా యావత్ ప్రపంచమంతా పోరాడుతూనే ఉంది. ఈ ట్రీట్‌మెంట్లో భాగంగా పలు రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్న వైద్యులకు టీబీ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇచ్చిందట. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. కొందరు రీసెర్చర్లు వ్యాక్సిన్ ద్వారా పొటెన్షియల్ ప్రోటెక్టివ్ ఎఫెక్ట్ గా ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇతరులు దీనిని వ్యాక్సిన్ కనిపెట్టడంలో ఇదొక సాక్ష్యంగా అనుకుంటున్నారు. దీనిపై చేస్తున్న స్టడీలో టీబీ వ్యాక్సిన్ కొవిడ్-19పై ఎంత ప్రభావవంతంగా పనిచేయగలదో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఈ స్టడీ చేయడానికి అరసంవత్సరం పూర్తి చేసేసింది MANKIND. ఈ పోరాటమనేది సుదీర్ఘమైనదంటూ నేతలే పోల్చి చెప్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ వ్యాక్సిన్ కనిపెట్టకపోయినా.. ఈ క్రమంలో వైరస్ మెడిసిన్ కోసం మేమింకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దీనిని కచ్చితంగా ఎదురించగల మెడిసిన్ ను తీసుకొస్తాం.

ఈ మహమ్మారి చాలా రకాలుగా దాడిచేస్తుంది. మనం ఊహించినట్లుగా అస్సలు లేదు. ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అనుసరించే దేశాల్లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మెడిసిన్ పరంగా చూస్తే BCG వ్యాక్సిన్ చాలా వరకూ సమస్యపై పోరాడేందుకు సాయం చేస్తుంది. క్షయ వ్యాధికి వాడే ఈ వ్యాక్సిన్ పనితీరు మిగిలిన వాటితో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది.

BCGవ్యాక్సిన్ ను ఫస్ట్ 1921లో వాడారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. అత్యవసరమైన మెడిసిన్స్ లో ఒకటిగా చేర్చారు. దాంతో పాటుగా సొసైటీలోని సేఫెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ లో ఒకటిగా దీనిని చేర్చారు. రీసెర్చర్లు ఈ వ్యాక్సిన్ కరోనాకు మందుగా కాకపోయినా చాలా మందిని కోలుకునేలా చేస్తుందని అంటున్నారు.

బీసీజీ వ్యాక్సిన్ శరీరానికి అంతర్గతంగా ప్రొటెక్షన్ ఇస్తుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటూ.. న్యూమోనియా, ఫ్లూల నుంచి కాపాడుతుంది. చిన్నవాళ్లలో, పెద్ద వాళ్లలో సమస్యలు లేకుండా చూస్తుంది. అంటే దాని పనితీరుకు కొవిడ్ 19 నుంచి పోరాడటానికి శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.