Tunisia Boat Accident: పడవ బోల్తా.. 50 మందికి పైగా వలసదారుల మృతి!

మధ్యధరా సముద్రంలో తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్యునిషియా తీరంలో ఇటీవల పడవలు ముగిన సంఘటనలు జరిగాయి.

Tunisia Boat Accident: పడవ బోల్తా.. 50 మందికి పైగా వలసదారుల మృతి!

Tunisia Boat Accident

Tunisia Boat Accident: మధ్యధరా సముద్రంలో తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్యునిషియా తీరంలో ఇటీవల పడవలు ముగిన సంఘటనలు జరిగాయి. ట్యునీషియా, లిబియా నుండి వలసదారులు యూరప్ వైపు ప్రయాణించడం.. ప్రాణాలను పణంగా పెట్టి ఈ ప్రయాణాలు సాగడం.. పరిధికి మించి ఎక్కువగా ప్రయాణికులు పడవలలో ప్రయాణించడంతో వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కొద్దిగా విరామం ఇచ్చిన వలసదారులు ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడినందున మరోసారి యూరప్‌ వైపు వలసలు పెరిగాయి.

దీంతో తాజాగా మరోసారి ట్యునీషియాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి చెందగా.. మరో 33 మందిని రక్షించినట్లు ట్యునీషియాకు చెందిన రెడ్‌ క్రెసెంట్ సంస్థ తెలిపింది. లిబియా నుంచి వలసదారుల పడవ ఇటలీకి వెళ్తుండగా ట్యునీషియా తీరం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉండగా.. 33 మందిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగామని.. వీరంతా బంగ్లాదేశీయులని రెడ్‌ క్రెసెంట్‌ అధికారి మొంగి స్లిమ్‌ పేర్కొన్నారు.

మరోవైపు ఈ ప్రమాదంలో 57 మంది మృతి చెందారని భద్రతా వర్గాలు కూడా నిర్ధారించాయి. ట్యునీషియా తీరంలో పడవలు మునిగిన ఘటనల్లో ఇటీవల సుమారు 60 మందిపైగా వలసదారులు మరణించగా.. ఇప్పుడు ఒకేసారి యాభై మందికి పైగా మరణించడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. ట్యునీషియా, లిబియా, అల్జీరియాకు చెందిన వేలమంది సముద్రం మీదుగా ఐరోపాకు వలస వెళ్తుండగా ఇప్పటికే ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు వచ్చారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ అంచనా వేస్తుంది.

సముద్రం మీదుగా ఆయా దేశాల నుండి వచ్చే వలసదారులు ఇలా ప్రమాదాలు జరుగుతూ మరణిస్తున్నా.. ఈ వలసలు ఆగేలా లేవు మొత్తం ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 633 మంది గల్లంతైన వారు, మరణించిన వారు ఉన్నా వలసలు ఆగడం లేదు. ఆయా దేశాలలో భయానక పరిస్థితులతోనే ప్రజలు ప్రాణాలకు తెగించి అక్రమంగా పొరుగు దేశాలలో చొరబడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యలో సముద్రంలోనే ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వరస ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా ఈ వలస ప్రయాణాలు మాత్రం ఆగడం లేదు.