బాగ్దాదీ సోదరిని పట్టుకున్న టర్కీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2019 / 09:52 AM IST
బాగ్దాదీ సోదరిని పట్టుకున్న టర్కీ

ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడిన ఐసిస్ ఉగ్రసంస్థ ఫౌండర్ అబూ బకర్‌ ఆల్‌-బాగ్దాదీ కుటంబసభ్యులను టర్కీ అధికారులు గుర్తించారు. బాగ్దాదీ సోదరి రస్మియా అవాద్,ఆమె భర్త, మేనకొడలిని ఉత్తర సిరియాలోని అజాజ్ సిటీలో గుర్తించినట్లు టర్కీ అధికారులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురు పిల్లలతో కలిసి ఉన్న సమయంలో రస్మియాను అదుపులోకి తీసుకున్నట్లు టర్కీ తెలిపింది.

గత నెల 26న అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రైడ్ సమయంలో సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్‌ లో తనంట తానుగా సూసైడ్ వెస్ట్(కోటు)ధరించి తన ముగ్గురు పిల్లలతో కలిసి బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అబూ బాక‌ర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కన్ఫర్మ్ చేశాడు. అమెరికా దళాలు బాగ్దాదీపై నిర్వహించిన ఆపరేషన్ వీడియోను కూడా ఇటీవల అమెరికా విడుదల చేసింది.

తమ ఉగ్రసంస్థ నాయకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ చనిపోయినట్లు ఐసిస్ కన్ఫర్మ్ చేసింది. అమెరికా చేసిన ప్రకటన నిజమేనని తెలిపింది. ఐసిస్ కు కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు తెలిపింది. అబు ఇబ్రహీం హష్మీ అల్-ఖురేషి అలియాస్ అబ్దుల్లా ఖర్షద్ ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన ఆడియోటేప్ లో ఐసిస్ తెలిపింది.