Man and swan Cute Friendship..మనసుని కదిలిచే 37 ఏళ్ల దోస్తీ..

Man and swan Cute Friendship..మనసుని కదిలిచే 37 ఏళ్ల దోస్తీ..

Man and swan Cute Friendship : మనుషులకు జంతువులతోనే కాదు పక్షులతోను మంచి దోస్తీ ఉంటుందనే విషయం తెలిసిందే. చిలుకలు..ముద్దుముద్దు మాటలు చెప్పే మైనాలు, పురివిప్పి ఆడే మయూరాలతో చెలిమి చాలా హాయిగా ఉంటుంది. అటువంటిది అందాల రాజహంసతో స్నేహం ఇంకెంత బాగుంటుందో కదా..అటువంటి వీరి స్నేహం..Man and swan స్నేహం వెరీ వెరీ క్యూట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

వీరి అపురూపమైన స్నేహం 37 ఏళ్ల నుంచి సాగుతోంది. 37 ఏళ్లనుంచి అంటూ అసలు హంసలు అన్నేళ్లు బతుకుతాయా? అనే పెద్ద డౌట్ వస్తుంది. సాధారణంగా 10 అనీ 15 ఏళ్లని అంటారు. కానీ హంసల జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్లు ఉంటుంది. కానీ టర్కీలో నివసిస్తున్న రిసెప్‌ మిర్జాన్ అనే 63 ఏళ్ల వ్యక్తికీ ఓ హంసకు ఏర్పడిన స్నేహం 37 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. అది ఉత్త స్నేహమే కాదు ప్రాణస్నేహం..

రిసెప్‌ మిర్జాన్ పోస్ట్‌మాన్‌గా పనిచేసేవారు. ఆ రోజుల్లో వెస్ట్ ఎదిర్ ఏరియాలో రిసెప్‌ మిర్జాన్ కు చిన్న హంస కూన దొరికింది. అలా స్నేహం మొదలైంది వారి స్నేహం. ఇప్పుడు మిర్జాన్, హంస ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మిర్జాన్ ఏంచేసినా ఆ హంస పక్కనే ఉంటుంది. ఆయన వాకింగ్ కు వెళితే తన తెల్లటి పొడవాటి రెక్కల్ని అందంగాకదిలిస్తూ వయ్యారమైన (హంస నడకలు అంటారే అలా) నడుస్తూ..మిర్జాన్ కూడా కలిసి నడుస్తుండి..

అలా ఇద్దరూ కలిసి వాకింగ్ చేస్తుంటారు. అది చూసిన వాళ్లకు భలే ఉందే అనిపిస్తూంది. చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తికాదు..

మిర్జాన్ కు ఈ హంస ఆయనకు దొరికినప్పుడు దాని రెక్కలు దెబ్బతిన్నాయి. ఎగరలేని స్థితిలో బాధపడుతుంటుంది. అలా మిర్జాన్ దాన్ని కాపాడి… వేటగాళ్లకు చిక్కకుండా తన కారులో ఇంటికి తీసుకొచ్చారు. దానికి వైద్యం చేసి తనతోనే ఉంచుకున్నారు. అప్పటి నుంచి హంస మిర్జాన్ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయింది. గ్రీక్ సరిహద్దుల్లోని తోటల్లో ఇద్దరూ కలిసి తిరుగాడుతుంటారు. అలా..అలా.. హాయిగా ఇద్దరి స్నేహం సాగిపోతోంది..

మిర్జాన్‌కి జంతువులు, పక్షులంటే ఎంతో ఇష్టం. తన రాజహంస గురించి మిర్జాన్ మాట్లాడుతూ..”నేను మొదటిసారి ఆ హంసను చూసినప్పుడు అది రెక్కలు కదిలించే పరిస్థితిలో కూడా లేదు. కనీసం అరిచే పరిస్థితిలో కూడా లేదు. దాన్ని అలా చూసి వదల్లేకపోయాను. అందుకే ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి కూడా ఉంచేసుకున్నానని..దానికి ‘గారిప్’ అని పేరు పెట్టి చూసుకుంటున్నానని చెప్పారు మిర్జాన్.

గారిప్‌తోపాటూ… మిర్జన్‌కి కొన్ని కుక్కలు, పిల్లులు కూడా ఉన్నాయి. అవి కూడా ఆయనకు ఫ్రెండ్సే. కానీ గారిప్ తో ఉండే ఫ్రెండ్సిప్ మాత్రం ప్రత్యేకం అంటారాయన.

సాధారణంగా హంసలు 30 నుంచి 40 ఏళ్ల వరకూ జీవిస్తాయి. అవి స్వతంత్రంగా బతికే ఓ హంస మాత్రం 19 ఏళ్లు జీవించింది. కానీ ఎవరైనా వాటి జాగ్రత్తగా సంరక్షిస్తే మాత్రం హంసలు ఎక్కువ కాలం జీవిస్తాయట..ఈ Man and swan Cute Friendship సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.