విశ్వాసం అంటే అదే : యజమాని కోసం ఆస్పత్రిలో బయటే నిలబడి ఎదురు చూస్తున్నకుక్క

విశ్వాసం అంటే అదే : యజమాని కోసం ఆస్పత్రిలో బయటే నిలబడి ఎదురు చూస్తున్నకుక్క

Turkey pet dog waits for days outside hospital to meet sick owner : పెంపుడు కుక్కకు అనారోగ్యం వస్తే దాన్ని పెంచుకునేవాళ్ల తల్లడిల్లిపోతారు. అలాగే విశ్వాసానికి మారుపేరు అయిన కుక్కలు కూడా తమ యజమానుల గురించి ప్రాణాలకు పణ్ణంగా పెట్టిన సందర్భాల గురించి విన్నాం. యజమాని కోసం పెంపుడు కుక్కలు కూడా తపన పడుతుంటాయి. వాళ్లు హ్యాపీగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాయి. అటువంటి ఓ కుక్క అనారోగ్యంతో ఉన్న తన యజమాని హాస్పిటల్ లో చేరితే..అతని కోసం తప్పించిపోయింది. రోజు హాస్పిటల్ దగ్గరకొచ్చి మెయిన్ డోర్ బైటే నిలబడి యజమాని కనిపిస్తాడేమోనని ఎదురు చూసి చూసీ వెళ్లిపోతోంది. అలా ప్రతీ రోజు హాస్పిటల్ కు వచ్చి బయటే నిలబడి ఎదురు చూస్తున్న ఓ కుక్క సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    

టర్కీలో సముద్ర నగరమైన ట్రాబ్ జోన్ కు చెందిన సెమల్ సెంటుర్క్ అనే వ్యక్తికి బోనుక్ అనే కుక్క ఉంది. అదంటే ఆ సెమల్ కు చాలా ఇష్టం. అలాగే యజమాని అంటే బోనుక్ కు కూడా ఎంతో ఇష్టం. ఈక్రమంలో జనవరి 14న సెమల్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రిలో చేర్పించారు.

అంబులెన్సులో సెమల్ ను తీసుకెళ్లడం గమనించిన బొనుక్ అంబులెన్స్ వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లింది. అలా ఆసుపత్రి వరకూ వచ్చింది. అంబులెన్స్ లోంచి యజమాని లోపలికి తీసుకెళ్లటం చూసిన బోనుక్ కంగారుపడిపోయింది. అక్కడక్కడే అటూ ఇటూతిరుగాడుతూ తన యజమానికి ఏమవుతుందోనని తెగ ఆందోళన పడిపోయింది. అలా ఆ రోజంతా ఆస్పత్రి బయటే నిలబడి ఎదురు చూసింది. అలా రాత్రి అయిపోయింది.దీంతో సెమల్ కుమార్తె ఐనూర్ ఎగెలి ఆస్పత్రికి వచ్చి బోనుక్ ను తీసుకెళ్లింది.

కానీ ఆ మరునాడు ఉదయం బోనుక్ మళ్లీ ఆస్పత్రి దగ్గరు వచ్చేసింది. యజమాని కోసం తలుపు వద్దే నిరీక్షించి..నిరీక్షించేది. సెమల్ ఆస్పత్రిలో చికిత్స పొందినన్ని రోజులు ప్రతీరోజు ఆస్పత్రికి రావటం మెయిన్ గేటు బయలే నిలబడటం చేస్తుండేది. తిరిగి రాత్రి ఇంటికెళ్లిపోయి మళ్లీ ఉదయం తిరిగి వచ్చేసేది. అలా వారం రోజుల పాటు యజమాని కోసం ఆస్పత్రి బైటే పడిగాపులు కాసింది. ఎదురు చూస్తున్న కుక్కను ఆస్పత్రి సిబ్బంది గమనించి..యజమాని అంటే ఎంత ప్రేమ..అనుకునేవారు.

దీనిపై ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ మహమ్మత్ మాట్లాడుతూ..ప్రతీరోజు ఉదయం 9గంటలకల్లా ఈ కుక్క వచ్చి రాత్రి వరకూ ఎదురు చూసి వెళుతుండేదని చెప్పాడు. తలుపు బైటే నిలబడి ఎదురు చూసేది లోపలికి వెళ్లేదికాదు..తన యజమాని వస్తాడని కాబోలు అని తెలిపాడు. అలా జనవరి 20 కోలుకున్న సెమల్ ను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. వీల్ చైర్లో ఆస్పత్రి తలుపు వద్దకు వచ్చిన సెమల్ తన కుక్కను చూసి ఆశ్చర్యపోయాడు.ప్రతీరోజు ఇలా వచ్చి ఎదురు చూస్తోందని ఆస్పత్రి సిబ్బంది చెప్పటం విని సెమల్ ఆనందంతో పరవశించిపోయారు. దాన్ని ప్రేమగా నిమిరి..తన బోనుక్ తో కలిసి ఇంటికి చేరుకున్నాడు.

తన కుక్క బోనుక్ గురించి సెమల్ మాట్లాడుతూ..తాను ఆస్పత్రిలో ఉన్న వారం రోజులు బోనుక్ ను చాలా మిస్ అయ్యానని..అదంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. బోనుక్ కు కూడా తనంటే ఎంత ఇష్టమో తెలిసి చాలా చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చాలా సార్లు చాలా చోట్ల జరిగాయి. కుక్కలకు మనుషులతో ఉండే బంధం అనుబంధ ఈ ఘటనతో తెలుస్తోంది.