Turkey Syria Earthquake : చిగురిస్తున్న ఆశలు.. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు వేగవంతం

భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాలో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచింది. శిథిలాల నుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం కొంత ఊరటనిస్తోంది.

Turkey Syria Earthquake : భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాలో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచింది. శిథిలాల నుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం కొంత ఊరటనిస్తోంది. హటాయ్ ప్రాంతంలో శిథిలాల కింద 128 గంటల పాటున్న 2 నెలల చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడారు.

ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్తానికులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండేళ్ల బాలికను, 6 నెలల గర్భవతిని, 70ఏళ్ల వృద్ధురాలిని శిథిలాల కింద నుంచి రక్షించారు.

Also Read..Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

భూకంపం సంభవించి 5 రోజులు గడుస్తున్నా కొందరు శిథిలాల కింద ఇంకా ప్రాణాలతో ఉండటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో 67 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. దీంతో ఆచూకీ లేకుండా పోయిన తమ వారిపై బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. 28వేల మందికిపైగా చనిపోయారు. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇంకా చాలామంది శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. దీంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ఓ భవనం శిథిలాల కింద ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సజీవంగా బయటపడటంతో ఆశ్చర్యానికి గురి చేసింది. స్థానికుల్లో కన్నీళ్లతో కూడిన సంతోషం వెల్లవిరిసింది. ఇద్దరు చిన్నారులు సహా పెద్దలు సురక్షితంగా ఉన్నారు. గత 5 రోజుల తర్వాత కూడా పలువురు మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడుతున్నారు.(Turkey Syria Earthquake)

Also Read..Turkey Earthquake : టర్కీ శిథిలాల్లో మృత్యుంజయుడు.. 94 గంటలు మూత్రం తాగి బతికాడు

మరోవైపు ప్రకృతి ప్రకోపానికి శిథిలాల దిబ్బగా మారిన టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 28వేలు దాటింది. టర్కీలో 24వేల 617 మంది.. సిరియాలో 3వేల 575 మంది మరణించారు. మృతుల సంఖ్య 30వేలు దాటే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇంతటి విపత్తులో కూడా కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. శిథిలాల కింద నుంచి కొంతమంది మృత్యుంజయులుగా బయటపడుతున్నారు. ఇటీవల సిరియాలో శిథిలాల కిందే ఓ శిశువు జన్మించాడు. 17 ఏళ్ల కుర్రాడు 94 గంటలకు పైగా శిథిలాల కింద ఉండి, తన మూత్రం తానే తాగి ప్రాణాలను దక్కించుకున్నాడు. టర్కీలోని హటాయ్ ప్రాంతంలో శిథిలాల కింద 128 గంటల పాటున్న 2 నెలల శిశువును సిబ్బంది కాపాడారు. తల్లిపాలు లేకుండా ఈ చిన్నారి 128 గంటల పాటు సజీవంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది దేవుడి అద్భుతం అంటున్నారు స్థానికులు.

భూకంపం వచ్చి ఐదు రోజులు అవుతోంది. పలు దేశాలకు చెందిన సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారత్ కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. రెస్య్కూ సిబ్బందితో పాటు డాక్టర్లను, మందులను టర్కీకి పంపింది. మొదటి మూడు రోజులు కీలకం కాగా, ప్రస్తుతం ఆ గోల్డెన్ టైమ్ అయిపోయింది. దీంతో రానున్న కాలంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు