ఎడారి దేశంలో ఇసుక తుఫాన్

  • Published By: madhu ,Published On : September 14, 2020 / 12:13 AM IST
ఎడారి దేశంలో ఇసుక తుఫాన్

Turkey Sandstorm : ఎడారి దేశం టర్కీలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆకాశం ఎత్తు రేగుతోన్న ఇసుకతో మొత్తం నగరాలకు నగరాలనే కప్పేస్తోందా అన్న రేంజ్‌లో చెలరేగుతోంది..ఈ ఇసుక తుఫాన్ దెబ్బకి టర్కీ రాజధాని అంకారా, పొలాటిలో దాదాపు ఆరుగురు గాయపడ్డారు.



ఇసుక తుఫాన్ రేగుతోన్న దృశ్యాలు చూస్తుంటే ఓ పెద్ద భూతం నగరాన్ని కబళించడానికి వస్తున్నట్లు అన్పించకమానదు..ఈ విజువల్స్‌లో కొన్నిటిని స్వయంగా అంకారా మేయరే ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. టర్కీ రాజధాని అంకారాలో పదంతస్తులు..పదిహేను అంతస్థుల భవంతులున్న ప్రాంతం నుంచి కొంతమంది ఈ ఇసుక తుఫాన్
విజువల్స్ షూట్ చేసారు..వారున్న ప్రదేశానికి కనీసం పదింతలు ఎత్తులో రేగిన ఇసుక..దట్టమైన పొగను తలపింపజేస్తోంది..అంతేకాదు..గాల్లోకి ఎగజిమ్మిన ఇసుకరేణువులతో ఆకాశమంతా నారింజ రంగులో మారడం కన్పించింది..



ఈ తుఫాన్ దెబ్బకి నగర వీధుల్లో కార్లు..ఇతర వాహనాలు దారి తెలియక నిలిచిపోవడం కన్పించింది..ఇదే పరిస్థితి ఎక్కువసేపు కొనసాగితే భారీ ప్రమాదాలు కూడా జరుగుతాయనే ఆందోళన నెలకొంది..హబూబ్‌గా పిలిచే ఈ ఇసుక తుఫాన్లు మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. టర్కీలో ఇలాంటి ఇసుక తుఫాన్లు ఏడాదిలో కనీసం రెండు వస్తుంటాయని అంచనా..ప్రస్తుతం వచ్చిన ఈ శాండ్ స్ట్రోమ్‌ ధాటికి అంకారా నగరంలో ఆరుగురు గాయపడ్డట్లు
తెలుస్తోంది.