Employes termination: వారంలో 18,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన..! ట్విటర్, మెటా బాటలో మరికొన్ని కంపెనీలు?

ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.

Employes termination: వారంలో 18,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన..! ట్విటర్, మెటా బాటలో మరికొన్ని కంపెనీలు?

Twitter and Face book

Employes termination: ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ట్విటర్ ఈనెల 4న తమ సంస్థలో పనిచేసే 7,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకగా, తాజాగా మెటా ఏకంగా 11వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. మెటా చరిత్రలో తొలిసారిగా అత్యంత కష్టతరమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, 11 వేల మంది ఉద్యోగులను తొలగించామని తెలిపారు.

Meta Sacks Employees: 11వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా.. క్షమాపణలు చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్ ..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు కంపెనీలకుసైతం లాభాలు తగ్గుముఖం పట్టాయి. లాభాలు అటుంచితే.. ఆర్థికంగా అదనపుభారం పడుతోంది. ఈ నష్టాలను నివారించడానికి ఆయా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్విటర్, మెటా ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. అవుట్ లుక్ నివేదిక ప్రకారం.. ట్విటర్, మెటా బాటలో నడిచేందుకు మరికొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Twitter Employees: మనసు మార్చుకున్న మస్క్..? తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు.. ఎందుకంటే?

అమెజాన్ ఇప్పటికే నియామకాలను నిలిపివేయగా, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాప్ట్, స్నాప్ కూడా తమ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయట. గతనెల నుండి మైక్రోసాప్ట్ తన వెయ్యి మంది ఉద్యోగులకు, నెట్ ఫిక్స్ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. స్నాప్‌చాట్ వెయ్యి మందిని తొలగించింది. ఈ జాబితాలో ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయని, త్వరలో ఆయా కంపెనీల తమ ఖర్చులను తగ్గించుకొని ఆదాయం పెంచుకొనే మార్గంలో ఉద్యోగులపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు అవుట్ లుక్ తన నివేదికలో పేర్కొంది.