ట్రంప్ ట్వీట్ తొలగించిన ట్విట్టర్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2020 / 12:16 PM IST
ట్రంప్ ట్వీట్ తొలగించిన ట్విట్టర్

Twitter Flags Trump’s Tweet అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బిగ్ విన్ అంటూ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ ను ట్విట్ట‌ర్ సంస్థ తొల‌గించింది. భారీ విజ‌యం దిశ‌గా వెళ్తున్నామ‌ని, ఎన్నిక‌లను కైవ‌సం చేసుకోనున్న‌ట్లు ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ త‌న అకౌంట్ నుంచి తొల‌గించింది.



అయితే, ప్ర‌త్య‌ర్థులు ఎన్నిక‌ల‌ను దోచేయడానికి ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. పోలింగ్ స‌మ‌యం ముగిసిన త‌ర్వాత ఓట్లు వేయ‌రాదు అని ట్రంప్ త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే మాజీ ఉపాధ్య‌క్షుడు, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని క్ష‌ణాల‌కే ట్రంప్ .. బిగ్ విన్ అని ఓ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ పోస్టు చేసిన ట్వీట్‌లో ఉన్న సారాంశం.. ఎన్నిక‌ల ప్ర‌క్రియను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ త‌న వార్నింగ్‌లో పేర్కొన్న‌ది.



కాగా, ఇప్పటివరకు వెల్లడైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో 219 ఎలక్టోరల్ ఓట్లతో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్​ 211 ఎలక్టోరల్​ ఓట్లు సాధించారు. ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా(55), న్యూయార్క్‌(29),వర్జీనియా‍‌(13), వాషింగ్టన్‌(12)లో బైడెన్‌ విజయం సాధించారు. ఇక, కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో జరిగిన హోరాహోరీ పోరులో ట్రంప్ విజయం సాధించారు. కీలక రాష్ట్రాలైన టెక్సాస్ ,పెన్సిల్వేనియాలో కూడా ట్రంప్ విజయం సాధించారు.