రియల్ గేమ్ ఫైట్ : రేసు మధ్యలో ఇద్దరు బైకర్లు కొట్టేసుకున్నారు

పాపులర్ బైక్ గేమ్.. రోడ్ ర్యాష్.. అంటే ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలామంది ఈ గేమ్ ను తమ మొబైల్స్ లో ఆడుతూనే ఉంటారు. ఈ గేమ్ లో బైక్ రైసులో ఒక బైకర్..

  • Published By: sreehari ,Published On : March 31, 2019 / 11:28 AM IST
రియల్ గేమ్ ఫైట్ : రేసు మధ్యలో ఇద్దరు బైకర్లు కొట్టేసుకున్నారు

పాపులర్ బైక్ గేమ్.. రోడ్ ర్యాష్.. అంటే ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలామంది ఈ గేమ్ ను తమ మొబైల్స్ లో ఆడుతూనే ఉంటారు. ఈ గేమ్ లో బైక్ రైసులో ఒక బైకర్..

పాపులర్ బైక్ గేమ్.. రోడ్ ర్యాష్.. గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలామంది ఈ గేమ్ ను తమ మొబైల్స్ లో ఆడుతూనే ఉంటారు. ఈ గేమ్ లో బైక్ రైసులో ఒక బైకర్.. మరో బైకర్ ను క్రాస్ చేసేందుకు పోటీ పడుతుంటారు.

ఈ క్రమంలో ఇద్దరు బైకర్లు పొట్లాడుకోవడం చేస్తుంటారు. ఒకరిని కింద పడేసి మరొకరు బైక్ మీద రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ఇలాంటి ఘటనే రియల్ గా జరిగింది. మొబైల్ రేసు గేమ్ తరహాలో జరిగిన రియల్ బైక్ రేసు గేమ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కోస్టా రికా నేషనల్ మోటర్ బైక్ చాంపియన్ షిప్ బైక్ రేసు షోలో ఈ ఘటన జరిగింది. 
Read Also : రీఛార్జ్ చేసుకోండి : జియో.. బెస్ట్ 4G Data ప్లాన్స్ ఇవే

ఈ రేసులో ఇద్దరు బైకర్లు తమ రేసును ఆపేసి.. రోడ్డుపై పొట్లాడుకున్నారు. ముందుగా ఇద్దరు బైకర్లు పోటీపడుతూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో రెండు బైకులు దగ్గరగా వచ్చి ఢీకొనడంతో ఒకరి బైక్ జారి పక్కకు దూసుకెళ్లింది. ఇంతలో బైక్ మీదన్నవ్యక్తి మరో బైకర్ బైక్ వెనుక వేలాడాడు. బైక్ ను ముందుకు వెళ్లనీయకుండా వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.

ఆవేశంలో ఇద్దరు బైకర్లు ఒకరిపై మరొకరు పొట్లాడుకున్నారు. ఐరీస్ న్యూస్ కథనం ప్రకారం.. రేసర్ జార్జ్ మార్టినీజ్, మారియన్ కెల్వోగా ఇద్దరు రేసర్లపై వేటు పడింది. రేసు మధ్యలో ఆపేసి పొట్లాడినందుకు వీరిద్దరిపై లాటిన్ అమెరికన్ బ్రాంచ్ అంతర్జాతీయ మోటార్ సైక్లింగ్ ఫెడరేషన్ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Read Also : క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది