Antarctica: రక్తం గడ్డకట్టే అంటార్కిటికాలో3,600 కి.మీటర్ల పాదయాత్ర..ప్రాణాల్ని పణంగా పెట్టి పరిశోధనలు

రక్తం గడ్డకట్టే అంటార్కిటికాలో 3,600 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టారు ఇద్దరు సాహసీకులు. ప్రాణాలకు పణంగా పెట్టి పరిశోధనలు చేపట్టారు.

Antarctica: రక్తం గడ్డకట్టే అంటార్కిటికాలో3,600 కి.మీటర్ల పాదయాత్ర..ప్రాణాల్ని పణంగా పెట్టి పరిశోధనలు

Two British Adventurers Cover 3,6000 Km In Antarctica

Two Researchers yathra in Antarctica:  అంటార్కిటికా.అంటార్కిటికా భూమికి అత్యంత దక్షిణ చివరన ఉన్న ఖండం.1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. 98% ఐసుతో కప్పబడి ఉండే ఖండం. రక్తం కూడా గడ్డకట్టిపోయేంత చలి. అటువంటి అంటార్కిటికాలో ఇద్దరు సాహసీకులు పాదయాత్ర చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత అతి శీతల వాతావరణం ఉండే అంటార్కిటికా ఖండంలో ఇద్దరు సాహసికులు చరిత్రాత్మక యాత్రకు శ్రీకారం చుట్టారు. మైనస్‌ 55 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు.. అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ 3,600 కి.మీ. పాదయాత్రను చేపట్టారు.అంటార్కిటికాలో పాదయాత్ర అంటే మాటలు కాదు. మృత్యువుతో చెలగాటం. ప్రాణాన్ని పణంగా పెట్టే ఆ పాదయాత్రలో అడుగు అడుక్కి ప్రమాదాలే..అడుగు తీసి అడుగు వేసేంతలో ప్రాణం కూడా పోవచ్చు.అటువంటి ప్రమాదకర మంచు ఖండంలో పాదయాత్ర..అది కూడా 3,600 కి.మీటర్ల దూరం పాదయాత్ర అంటే ఊహించుకుంటేనే రక్తం గడ్డకట్టిపోతుంది.

Read more : Santa Claus In Puri : పూరీ జగన్నాథుడి చెంత..గులాబీలతో 50 అడుగుల శాంతాక్లాజ్

ఆ ఇద్దరు సాహసీకులు పాదయాత్ర కోసం తీసుకెళ్లిన సరంజామా కూడా భారీ బరువుతో ఉంది. 200 కిలోల బరువుండే పరికరాలను స్లెడ్జ్‌పై ఈడ్చుకుంటూ వెళ్తు పాదయాత్ర చేశారు. 80 రోజులపాటు సాగే ఈ యాత్ర వెనుక శాస్త్ర, విజ్ఞాన రంగం కోసం తమ దేహాలనే ప్రయోగశాలగా మార్చిన చక్కటి ఆశయం ఉంది. అంగారక గ్రహంతోపాటు చంద్రుడిపై మానవుల ఆవాసానికి అనువైన వాతావరణంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

అంటార్కిటికాలో ఉండే అంత్యత కఠిన పరిస్థితులకు మానవ దేహం ఎలా ప్రతిస్పందిస్తుంది? శరీరంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయి? అనే విషయాలపై అధ్యయనం చేయటానికే ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అత్యంత అసాధారణ పరిస్థితులుండే అంటార్కిటికా ఖండంలో గడిపినప్పుడు మానవ శరీరంలో చోటుచేసుకునే మార్పులను పరిశీలించడానికి సాహసోపేతమైన యాత్రతో సంకల్పించారు. వారి సంకల్పమే వారి యాత్రను విజయవంతంగా కొనసాగిస్తోంది.

నాసా, యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఛేజింగ్‌ ది లైట్‌’ పేరుతో చేపట్టిన ఈ మిషన్‌లో పాలుపంచుకునేందుకు బ్రిటన్‌కు చెందిన జస్టిన్‌ పాక్షా, జేమీ పేసర్‌ చైల్డ్స్‌ అనే సాహసికులు ముందుకొచ్చారు. నవంబరు 12న అంటార్కిటికాలోని నొవొలజరెవ్‌స్కయా పరిశోధన కేంద్రం నుంచి ఈ యాత్రను ప్రారంభించి.. డిసెంబరు 15 నాటికి 1,083 కి.మీ. పూర్తి చేశారు. కైట్‌ సర్ఫింగ్‌తో పాటు ప్రధానంగా కాలినడకతో ప్రయాణిస్తున్నారు.

Read more : Pink Walking Fish: చేతులతో నడిచే గులాబీరంగు చేప..!22 ఏళ్లకు కనిపించిన అరుదైన మీనం

అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు మానవ శరీరం, మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించటానికి ఈ సాహస యాత్రతో శ్రీకారం చుట్టారు  పరిశోధకులు. ఒంటరితనం, సూక్ష్మజీవుల మనుగడ, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకోనున్నారు. ఇది అంతరిక్ష యాత్రల విషయంలో కీలకం కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.