Omicron Detected In Australia : ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ గుర్తింపు..సిడ్నీలో రెండు కేసులు

దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన ఆందోళనకరమైన కరోనా కొత్త వేరియంట్‌ "ఒమిక్రాన్‌" ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే బొత్స్వానా,హాంకాంగ్,ఇజ్రాయెల్,జర్మనీ సహా పలు దేశాల్లో

Omicron Detected In Australia : ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ గుర్తింపు..సిడ్నీలో రెండు కేసులు

Omicron (1)

Omicron Detected In Australia దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన ఆందోళనకరమైన కరోనా కొత్త వేరియంట్‌ “ఒమిక్రాన్‌” ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే బొత్స్వానా,హాంకాంగ్,ఇజ్రాయెల్,జర్మనీ సహా పలు దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదుకాగా,తాజాగా ఆస్ట్రేలియాలోకి ఈ కొత్త వేరియంట్ అడుగుపెట్టింది.

దక్షిణాఫ్రికా నుంచి శనివారం రాత్రి ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్నీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్ నిర్వహించగా..పాజిటివ్ గా తేలింది. వెంటనే వారి నమూనాలను ల్యాబ్ కు పంపగా..వారికి సోకింది “ఒమిక్రాన్” గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వారిని ఐసోలేషన్ కు తరలించారు. అయితే ఒమిక్రాన్ సోకిన వారిద్దరిలో ఎలాంటి లక్షణాలు లేవని, రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ను వారు తీసుకున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ప్రయాణలపై ఆంక్షలు విధించడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని అధికారులు చెప్పారు

ఇక,దక్షిణాఫ్రికా నుంచి శనివారం మొత్తం 14 మంది సిడ్నీ చేరుకోగా.. అందులో 12 మందికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా తేలిందని ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు తెలిపారు. అయినా ముందు జాగ్రత్తతో వారందరినీ క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. దాదాపు 260 మంది ఇతర ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఐసోలేట్‌కి అధికారులు పంపారు.

కాగా, దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన బీ 1.1.529(ఒమిక్రాన్) కరోనా వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసిన దేశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు మన దేశంలో కూడా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ALSO READ Peru Earthquake : పెరూలో భారీ భూకంపం