డివైడర్ ను ఢీకొట్టి..బిల్డింగ్ ఫస్ట్ ఫోర్ లోకి దూసుకెళ్లిన కారు

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 09:15 AM IST
డివైడర్ ను ఢీకొట్టి..బిల్డింగ్ ఫస్ట్ ఫోర్ లోకి దూసుకెళ్లిన కారు

తెల్లవారి లేస్తే చాలు ప్రమాదాల గురించి వింటునే ఉంటాం..చూస్తూనే ఉంటాం. డివైడర్ ను ఢీకొన్న కారు..లేదా బైక్ ఇలా వింటుంటాం. కానీ ఓ ప్రమాదం మాత్రం నమ్మశక్యం కాకుండా జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న ఓ కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొంది. ఆ వెంటనే ఏం జరిగిందో తెలుసుకునేలోగా..గాల్లోకి ఎగిరి ఓ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఆ కారును డ్రైవ్ చేస్తున్న  బ్రాడెన్ డిమార్టిన్ అనే 22 ఏళ్ల యువకుడితో పాటు అతనితో పాటు పక్కనే ఉన్న అతడి స్నేహితుడు 23 ఏళ్ల డేనియల్ ఫోలే కూడా చనిపోయారు. న్యూజెర్సీలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బ్రాడెన్ డెమార్టిన్ స్నేహితుడు డానియల్ ఫాలే కలిసి తన Porsche కారులో లాంగ్ డ్రైవ్‌కు బయల్దేరాడు. కారు టామ్స్ రివర్ వద్దకు చేరుకోగానే.. అతి వేగం వల్ల అదుపు తప్పి డివైర్‌ను ఢీకొట్టి ఆ వేగానికి కారు ఒక్కసారిగా గాల్లోకి లేచింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ భవనం మొదటి అంతస్తులోకి దూసుకెళ్లింది. ఈ భవనంలో కౌన్సెలింగ్ సర్వీస్ తో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు మరో  నాలుగు వ్యాపార సంస్థలు ఉన్నాయి.
కారు దూసుకొచ్చిన సమయానికి ఆ గదిలో ఎవరూ లేరు. కారు బలంగా భవనాన్ని ఢీకొట్టడం వల్ల బ్రాడెన్, డానియల్‌లు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కారులో చిక్కుకున్న వారి శరీరాలను బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది చాలా శ్రమించారు. తర్వాత క్రేన్ సాయంతో కారును కిందికి దించారు.

ఈ ప్రమాదం తరువాత ఈ ఫోటోలను వారి స్నేహితుడు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మనం అందరం కలిసి గోల్ఫ్ కోర్టులో గడిపిన రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను..మీతో ఆడుకున్న క్షణాలను మరచిపోలేనని తెలిపాడు.
మరో స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు చనిపోయారు. మీరుకూడా నాకు దూరమయ్యారు. మీతో గడిపిన రోజులు నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాననీ..మీ ఆత్మలకు శాంతికలగాలనీ..మీ కుటుంబ సభ్యులు మీ మరణం నుంచి తర్వగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపాడు.