Corona Virus: గుడ్ న్యూస్.. కరోనాకు రెండు రకాల మందులు.. WHO సిఫార్సు!

దేశంలో, ప్రపంచంలోనూ మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Corona Virus: గుడ్ న్యూస్.. కరోనాకు రెండు రకాల మందులు.. WHO సిఫార్సు!

WHO work against Covid

World Health Organization: దేశంలో, ప్రపంచంలోనూ మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా ప్రభావం కూడా ఇంకా ఏమాత్రం తగ్గలేదు. కరోనా వినాశనం కొనసాగుతూ ఉండగా.. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అన్ని దేశాలకు కరోనా చికిత్స కోసం రెండు మందులను సూచించింది. ఈ మందులు తీవ్రమైన అనారోగ్యం, ప్రాణాపాయం నుంచి రోగులను కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగులకు కాసిరివిమాబ్, బారిసిటినిబ్ అనే రెండు మందులను వాడితే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ మందులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉపయోగించవచ్చు అని అంటున్నారు. సాధారణంగా ఈ రెండు మందులను కీళ్లనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు.

రెండు మందులను కలిపి వాడవద్దు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ మెడిసిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌ను కలిగించదని, ఈ ఔషధం వాడితే రోగి ప్రాణాలకు ముప్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ మందులు అందుబాటులో ఉంటే, ఏ వ్యాధితో బాధపడకపోతే మీరు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చని, కానీ రెండింటినీ కలిపి మాత్రం ఉపయోగించవద్దని చెప్పింది WHO.

ట్రయల్ తర్వాతే.. WHO సిఫార్సు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ 4వేల మంది సాధారణ, తీవ్రమైన రోగులపై ఏడు సార్లు ఈ మందులను ప్రయత్నించింది. ట్రయల్ తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా, WHO ఈ రెండు మందులను సిఫార్సు చేసింది.