స్టెరాయిడ్లు తీసుకుంటే Covid-19 నుంచి బయటపడొచ్చట!!

స్టెరాయిడ్లు తీసుకుంటే Covid-19 నుంచి బయటపడొచ్చట!!

ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీలు Covid-19 నుంచి స్టెరాయిడ్లు రక్షించగలవని తెలిపాయి. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్లు కూడా కొత్తగా రికమెండ్ చేస్తున్నారు. తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.



జూన్ నెలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చాలా ఎన్‌హెచ్ఎస్ హాస్పిటల్స్ లో రికవరీ ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో 1/8వ వంతు రోగులు వెంటిలేటర్ తో చికిత్స అందుకుంటున్న సమయం నుంచి బయటపడగలిగారు. ఆ స్టెరాయిడ్ మరేదో కాదు డెక్సామెతాసోన్. ఇప్పుడు దాంతో పాటు మరో ట్రయల్స్ లో అంతే ధరతో ఎక్కువగా అందుబాటులో ఉండే స్టెరాయిడ్ హైడ్రోకోర్టిసోన్ ను కనుగొన్నారు. ఇది కూడా అంతే ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట.

తీవ్రంగా అనారోగ్యానికి గురైన పేషెంట్లను 20శాతం వరకూ ఈ స్టెరాయిడ్లు బాగు చేసి.. చనిపోయే ప్రమాదం నుంచి బయటపడేయగలవు. ఇందులో భాగంగానే వెయ్యి 703మంది పేషెంట్లపై ఏడు ట్రయల్స్ నిర్వహించారు. ఈ కథనం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురితమైంది. అదే జర్నల్ లో జరిగిన మూడు ట్రయల్స్ గురించి వివరించారు.



‘స్టెరాయిడ్లు అనేవి చీప్ గానూ.. మెడికేషన్ కు సిద్ధంగానూ ఉంటాయి. ఇవి వాడడం వల్ల COVID-19 పేషెంట్లను చావు వరకూ వెళ్లకుండా ఆపవచ్చు. అని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమియోలజీ ప్రొఫెసర్ జొనాథన్ స్టెర్న్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వయస్సుకు, లింగ బేధాలు లేకుండా ట్రయల్స్ లో రిజల్ట్స్ కనిపించాయి’
https://10tv.in/mission-karmayogi-aims-to-prepare-the-indian-civil-servant-for-future-prakash-javadekar/
ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న వారిని కాపాడటానికి.. తీవ్రమైన అనారోగ్య స్థితికి చేరుకున్న వాళ్లను కాపాడుకునేందుకు తరచుగా స్టెరాయిడ్లు వాడతాం. అది ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించి.. కొత్త వైరస్ లాంటి వాటి నుంచి కూడా తట్టుకోగలిగే కెపాసిటీ ఇస్తుంది. అని స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారు యూకే ప్రొఫెసర్లు. ఇక దీని గురించి ట్రయల్స్ నిర్వహించడం కూడా మానేసి డేటాను సేవ్ చేసుకున్నారట.



కొవిడ్ 19.. కరోనా వైరస్ తో పోరాడేందుకు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఒక ఆధారం దొరికిందనే అనుకుంటున్నాం. డెక్సామెథోసోనెతో ట్రీట్‌మెంట్ ఇవ్వగల్గుతున్నాం. దాంతో పాటు హైడ్రోకార్టిసోనె కూడా అదే రేంజ్ లో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19తో పోరాడటానికి మాకు మరో ఆయుధం దొరికినట్లు అయిందని ఎన్హెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్ సైమన్ స్టీవెన్స్ తెలియజేశారు.